సెక్స్ స్కాండల్ కేసు, గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, రేవణ్ణ దేశం విడిచి పారిపోయారా ?
మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ విషయంలో రాజకీయ లబ్ది పొందేందుకు ఆయన్ను అరెస్టు చేసి ఇలా చేస్తున్నట్టు తెలుస్తోందని, రేవణ్ణ ఈ దేశం నుంచి ఏమైనా పారిపోతారా?, రాజకీయాలు చెయ్యాలంటే ఇలా ప్రవర్తించాలా అంటూ కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొప్పళలో మీడియాతో మాట్లాడిన గాలి జనార్దన్ రెడ్డి జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అశ్లీల వీడియోల కేసు గురించి నేను మాట్లాడడం తగదని, ఆయన గురించి తాను మాట్లాడనని, ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలోనే ఇలాంటి అన్ని కథలు తెలుస్తాయా అని గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ ఏమైనా ఈ దేశం వదిలి ఎక్కడికైనా పారిపోతారా? అని సిద్దరామయ్య ప్రభుత్వాన్ని గాలి జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు.

మాజీ మంత్రి రేవణ్ణ కుటుంబం దేశం నుండి పారిపోయే కుటుంబమా?, ఇది రాజకీయ కక్ష తప్ప మరొకటి కాదని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. హెచ్‌డీ రేవణ్ణ దేశం విడిచి వెళ్తారా?, లేదు కదా, ఆయన ఇక్కడే ఉన్నారని, ఒకటికి రెండుసార్లు ఆలోచించి అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని గాలి జనార్దన రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే రేవణ్ణ విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేశారో తనకు అర్థం కావడంలేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు,
పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవాలని హెచ్ డీ రేవణ్ణ అనుకోలేదని, అయితే ఆయన విషయంలో అధికారులు తొందరనడ్డారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి రేవణ్ణ, మాజీ ప్రధాని హెచ్ డీ దేవగౌడకు గౌరవం ఇచ్చి ఉండాల్సిందని, పోలింగ్ కు 48 గంటల ముందు ఇలా డ్రామాలు ఆడటం సరికాదని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కర్ణాటక ప్రజలు మూర్ఖులు కాదని, ఎప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో అందరూ అర్థం చేసుకుంటారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

నరేంద్ర మోదీ దేశానికి మూడోసారి ప్రధాన మంత్రి అయ్యాక ఇలాంటి కాంగ్రెస్ డ్రామాలు ఆగడం ఖాయం అని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి నా ఇంటికి వచ్చి డబ్బులు అడుక్కుని వెళ్లి ఎమ్మెల్యే అయ్యారని, ఎమ్మెల్యేగా నా ఇంటికి వచ్చి బీజేపీకి మద్దతు ఇచ్చారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అదే వ్యక్తి కాంగ్రెస్ లో చేరి జాక్ పాట్ లో మంత్రి అయిపోయి తనను తిట్టడానికి ప్రయత్నిస్తున్నాడని, అతనికి త్వరలో తగిన బుద్ది చెబుతానని కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగిపై గాలి జనార్దన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు.
ఎవరు ఎవరి ఇంటికి వెళ్లారో మీకు తెలుసు, నాకు తెలుసు, మంత్రి శివరాజ్ తంగడిగ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని మరోసారి గాలి జనార్దన్ రెడ్డి ఆ మంత్రిని ఏకవచనంతో ఏకిపారేశారు. నా స్థాయి ఏమిటి? అతని స్థాయి ఏమిటి, అహంకారంతో ప్రధాని నరేంద్ర మోదీని, తనను మాట్లాడితే తరువాత నేను ఏంచెయ్యాలో అది చేస్తానని, ఇప్పటికైనా మంత్రి శివరాజ్ తంగడిగ అహంకారంతో మాట్లాడం వదిలేయాలని, లేదంటే అతన్ని గెలిపించిన నియోజక వర్గం ప్రజలే అతనికి తగిన బుద్ది చెబుతారని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడిగను హెచ్చరించారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications