గాలికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?: టపాల్

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి రాజకీయంగానే కాకూండా మైనింగ్ వ్యాపార పరంగా శత్రువులు ఉన్నారు. బళ్లారి మైనింగ్ వ్యాపారి టపాల్ గణేష్ గాలి జనార్దన్ రెడ్డి అక్రమ ఆస్తులు సంపాదించారని ఆరోపించారు.

ఆయన కుమార్తె పెళ్లికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకువస్తున్నారు ? అని ప్రశ్నించారు. పెళ్లి శుభలేఖలలో హెచ్ డీ ఎల్ ఈడీ స్కీన్లు పెట్టి పంచుతున్నారని, ఆ పెళ్లి ఆహ్వాన పత్రికలు రూ. ఐదు కోట్లకు పైగా ఖర్చు పెట్టారని మీడియాలో వార్తలు వస్తున్నాయని అన్నారు.

ఇంత డబ్బు గాలి జనార్దన్ రెడ్డికి ఎక్కడి నుంచి వస్తుందో అందరికి తెలియాలి అన్నారు. సీబీఐ అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించారని అన్నారు. తరువాత ఆయన ఆస్తులను ఈడీకి అటాచ్ చేశామని సీబీఐ అధికారులు చెప్పారని టపాల్ గణేష్ గుర్తు చేశారు.

Gali Janardhan Reddy’s source of income for the grand wedding of his daughter ? Tapal Ganesh

జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత గాలి జనార్దన్ రెడ్డికి ఏమాత్రం ఆదాయం లేదని, అయితే ఇంత ఆర్భాటంగా కుమార్తె పెళ్లి చేయడానికి ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందని టపాల్ గణేష్ ప్రశ్నించారు.గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహానికి తాను వ్యతిరేకం కాదని టపాల్ గణేష్ చెప్పారు. తన ప్రశ్న ఆయన ఆదాయం గురించే అని అన్నారు.

సీఎం ఎందుకు మోనంగా ఉన్నారు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య 2010లో బెంగళూరు నుంచి బళ్లారికి పాదయాత్ర చేశారని, ఆ సందర్బలో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగించిన మైనింగ్ కంపెనీల నుంచి ముక్కుపిండి రావలసి డబ్బులు వసూలు చేస్తామని బహిరంగంగా చెప్పారని టపాల్ గణేష్ అన్నారు.

అయితే అధికారంలోకి వచ్చిన తరువాత సిద్దరామయ్య ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నారు. గాలి అక్రమాస్తుల విషయంలో కేంద్ర, కర్ణాటక ప్రభుత్వాలు, సీబీఐ ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావాడంల లేదని అన్నారు.

గాలి విషయం గమనిస్తే ఆయన అన్ని కేసుల నుంచి తప్పించుకుని క్లీన్ చిట్ తీసుకుని బయటకు వస్తారేమో అని టపాల్ గణేష్ అనుమానం వ్యక్తం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి విషయంలో తాను సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు లేఖ రాస్తానని టపాల్ గణేష్ వివరించారు.

కర్ణాటక లోకాయుక్త మాజీ న్యాయమూర్తి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి శుభలేఖల విషయంపై స్పందించారు. శుభలేఖలకే ఇంత ఖర్చుపెడితే ఇక పెళ్లికి ఏ స్థాయిలో ఖర్చు పెడుతారో తెలుస్తోందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+