రూ. 2 వేల నోట్లు బ్యాన్, కాంట్రాక్టర్ భారీ డీల్, తిరుపతిలో పంగనామాలు పెట్టి !
బెంగళూరు: భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ నుండి రూ. 2,000. నోట్ల చలామణి నిలిపివేశామని, సరైన పత్రాలతో మీ దగ్గర ఉన్న నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయాలని అధికారులు సూచించారు. లక్షలాది మంది దగ్గర వందలు, వేల కోట్లలో రూ. 2, 000 నోట్లు మూలుగుతున్నాయి. మీరు రూ.500 నోట్లు ఇస్తే మీకు రూ. 2 వేల నోట్లు ఒకటిన్నర రెట్లు చెల్లిస్తానని ఓ సివిల్ కాంట్రాక్టర్ కు .25. లక్షలు కుచ్చుటోపీ పెట్టారు. తిరుపతికి పిలిపించి ప్రముఖ కాంట్రాక్టర్ కు మూడు నామాలు పెట్టి పంపించారు.
బెంగళూరులో మోసగాళ్ల నెట్‌వర్క్ వెలుగు చూసింది. రూ. 2,000 రూ. నోట్ల మార్పిడి పేరుతో సివిల్ కాంట్రాక్టర్ కు రూ.25 లక్షల మోసం చేశారు. బెంగళూరులో డీల్ కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి పిలిపించి పంగనామాలు పెట్టారు. రూ. 2, 000 రూ. ముఖ విలువ కలిగిన నోట్లను బ్యాన్ చేశారంటూ. వాటిని మార్పిడి చేస్తామని చెప్పి మోసం చేశారు. మోసపోయిన వ్యక్తి బెంగళూరు వెస్ట్ ఆఫ్ కార్డ్ రోడ్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ సురేష్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు.

మా వ్యాపారంలో డబ్బును పెట్టుబడిగా పెట్టండి అంటూ సురేష్‌కి రెండు నెలల క్రితం అజ్ఞాత వ్యక్తుల నుంచి కాల్ వచ్చింది. శివ అనే వ్యక్తి ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ రూ. 2, 000 నోట్లను బ్యాన్ చేయబోతున్నారని చెప్పారు. మా దగ్గర కోట్లాది రూపాయల విలువైన రూ.2, 000 రూపాయల నోట్లు ఉన్నాయని, మీరు రూ.500 ముఖ విలువ గల 25 లక్షలు ఇస్తే రూ.2, 000 ముఖ విలువ కలిగిన రూ. 37.5 లక్షలు ఇస్తామని, మీకు ఉపయోగపడుతుందని కాంట్రాక్టర్ సురేష్ కు చెప్పారు.
పలుమార్లు ఫోన్ చేసి కాంట్రాక్టర్ సురేష్‌ను నమ్మించిన మోసగాళ్లు సులువుగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశారు. దీన్ని నమ్మిన కాంట్రాక్టర్ సురేష్ తన కారులో రూ. 25 లక్షలు తీసుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. నిందితులు డబ్బు వసూలు చేయడానికి మే 27న మంత్రాలయంకు రావాలని కోరారు. తర్వాత హఠాత్తుగా ఫోన్ చేసి మంత్రాలయానికి వద్దని, తిరుపతిలో ఉన్నామని, అక్కడికి రమ్మని చెప్పారు. తిరుపతికి బయలు దేరిన కాంట్రాక్టర్ సురేష్ కు తవారుత నెల్లూరుకు రావాలని ఫోన్ చేసి చెప్పారు.
డబ్బుల కోసం మోసగాళ్లు ఎక్కడి రావాలని చెప్పినా తన కారులో డబ్బులు పెట్టుకునే కాంట్రాక్టర్ సురేష్ అక్కడికి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. చివరికి నెల్లూరుకు వెళ్లిపోయాడు. అక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తి మీ దగ్గరకు వస్తాడని నిందితులు సురేష్ కు చెప్పారు. కొంతసేపటికి ఆటోలో వచ్చిన వ్యక్తి నా పేరు శ్రీనివాస్ అని కాంట్రాక్టర్ సురేష్ ను పరిచయం చేసుకున్నాడు. అనంతరం ఓ సూట్ కేసు చూపించి రూ. 2వేల నోట్లు విడివిడిగా ఉన్న వాటిని చూపంచాడు. తరువాత ఈ నోట్లు బండిల్స్ గా కట్టి ఇవ్వాలని సురేష్ కోరాడు.
భర్త ఫ్రెండ్ తో రొమాన్స్, రాత్రి భర్తను మంచానికి కట్టేసి ఐదు ముక్కలుగా నరికేసిన భార్య !
https://telugu.oneindia.com/news/india/wife-who-tied-her-husband-to-the-bed-and-chopped-him-into-five-pieces-with-an-axe-in-uttar-pradesh-350123.html
తరువాత శ్రీనివాస్ అనే వ్యక్తి సురేష్ దగ్గర రూ. 25 లక్షల రూపాయల 500 నోట్లు తీసుకున్నాడు. కాంట్రాక్టర్ సురేష్ నుంచి 500 నోట్లతో ఉన్న రూ..25 లక్షలు ఉన్న బ్యాగ్ తీసుకుని ఇప్పుడే వస్తానని మాయం అయ్యాడు. కొంతసేపటికే సురేష్ కు ఫోన్ చేసిన నిందితులు మీరు రూ.2, 000 నోట్లు ఉన్న రూ. 37. 5 లక్షలు తిరుపతికి వచ్చి తీసుకోవాలని, ఇక్కడ డబ్బు కట్టలు కట్టి పెట్టామని చెప్పారు. అయితే అప్పటికి తాను మోసపోతున్నానేమోనని సురేష్‌కు అనుమానం వచ్చింది.
తిరుపతికి వెళ్లి నిందితుల ఫోన్ నెంబర్లకు ఫోన్లు చేస్తే అందరి నెంబర్లు స్విచ్ అయ్యాయి. అయినా డబ్బు ఇస్తారని రెండు నెలల నుంచి వేచి చూసిన సురేష్‌కి ఇంకా డబ్బులు అందకపోవడంతో మోసం జరిగిందని కాట్రాక్టర్ సురేష్ బెంగళూరుోని మహాలక్ష్మి లేఔట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. శివ, శివకుమార్ స్వామి, శ్రీనివాస్‌లపై కేసు పెట్టారు. మహాలక్ష్మి లేఔట్ పోలీసులు కేసును బెంగళూరు సీసీబీ పోలీసులకు అప్పగించారు. బెంగళూరు నుంచి తిరుపతి వరకు జరిగిన ఈ హడ్రామాలో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications