Gangatic dolphin : యూపీ జలజంతువుగా గంగానది డాల్ఫిన్లు-యోగీ ఆదిత్యనాథ్ ప్రకటన..
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర జలచరంగా గంగానది డాల్ఫిన్లను ఎంపిక చేస్తూ యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఓ ప్రకటన చేశారు. చెరువులు, నదుల స్వచ్ఛతను కాపాడుకోవాల్సిన అవసరాన్ని యోగీ గుర్తుచేశారు. ఈ డాల్ఫిన్లు గంగా, యమునా, చంబల్, ఘఘ్రా, రాప్తి , గెరువా నదులలో కనిపిస్తాయన్నారు.ఉత్తరప్రదేశ్‌లో గంగా డాల్ఫిన్‌ల జనాభా సుమారు 2 వేలుగా అంచనా వేశారు.
యూపీలో పర్యాటకులు, స్థానిక నివాసితులు ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. మన తాగునీరు, ప్రకృతికి ప్లాస్టిక్ తీవ్ర హాని కలిగిస్తుందన్నారు. వన్యప్రాణులతో ఎలా సంభాషించాలో స్థానికులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని యోగీ తెలిపారు. ఉపాధి అవకాశాలను సృష్టించడం , సమాజంలో అవగాహన పెంచడం లక్ష్యంగా టైగర్ రిజర్వ్‌కు అనుసంధానం చేసిన గ్రామాల వారికి మార్గదర్శకులుగా శిక్షణ ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు.

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని గర్ గంగాలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF), అటవీ శాఖ బృందాలు జీపీఎస్ సహాయంతో డాల్ఫిన్‌లను లెక్కిస్తున్నాయి. గర్ గంగాలో కొనసాగుతున్న డాల్ఫిన్ గణనపై డీఎఫ్వో సంజయ్ కుమార్ మాల్ వివరాలు వెల్లడించారు. "మేరీ గంగా మేరీ డాల్ఫిన్ 2023" పేరుతో దీనిపై ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని కింద ముజఫర్‌పూర్ బ్యారేజీ దగ్గర నుండి మొత్తం నరోరా బ్యారేజీ వరకు గంగా నదిలో డాల్ఫిన్‌ల లెక్కింపు జరుగుతోందన్నారు.
ఇందులో డబ్ల్యూడబ్ల్యూఎఫ్, అటవీ శాఖ బృందాలు రెండూ జాయింట్ యాక్షన్ ద్వారా లెక్కింపు చేపడుతున్నారు. ఇందులో రెండు టీంలు చొప్పున గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తే విధంగా కౌంటింగ్ విధానం ఉందన్నారు. వాటి మధ్య 10 నిమిషాల గ్యాప్ ఇచ్చారు. ముజఫర్‌పూర్ నుండి నరోరా బ్యారేజీ వరకు మొత్తం బృందం ఈ విరామంలో ఎన్ని డాల్ఫిన్‌లు డైవ్ చేస్తాయనేది గుర్తిస్తారు. ఆ బృందం డాల్ఫిన్ డైవింగ్‌ను చూసి దాని జీపీఎస్ లొకేషన్‌ను నమోదు చేస్తుంది. ఆపై మరొక బృందం వచ్చి దాని జీపీఎస్ లొకేషన్‌ను నమోదు చేస్తుంది. అది 10 నిమిషాల విరామం తర్వాత వస్తే అది అదే డాల్ఫిన్ అని చూపిస్తుంది, రాకపోతే ఆ తర్వాత అది మరో డాల్ఫిన్ కాబట్టి లెక్కింపు కూడా అదే విధంగా జరుగుతుందని తెలుస్తోంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications