గర్ల్‌ను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్, బలవంతంగా మతమార్పిడి!
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో దారుణం జరిగింది. ఓ ఇరవై ఏళ్ల యువతిని ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా.. ఆమెను బలవంతంగా మతమార్పిడి చేసిన సంఘటన వెలుగు చూసింది. దీంతో మీరట్ జిల్లాలోని ఖర్ ఖౌదా, అట్రాడా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఒక సామాజిక వర్గానికి చెందిన వారి ఇళ్ల పైన మరో సామాజిక వర్గానికి చెందిన ప్రజలు రాళ్లు రువ్విన సంఘటనలు ఆదివారం రాత్రి జరిగాయి. ఈ పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసు దళాలను మోహరించారు. ఖర్ ఖౌదా గ్రామపెద్దతో పాటు మత పెద్ద, ఆయన భార్య, కుమార్తెల ప్రోద్బలంతోనే ఈ ఘోరం జరిగినట్లు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గ్రామ పెద్ద, మరో అయిదుగురు కలిసి జూలై 23న తన కుమార్తెను అపహరించుకు వెళ్లి ఓ చోట బంధించి ఆమె పైన సామూహిక అత్యాచారం చేశారన్నారు. ఆ తర్వాత ఆమె మతాన్ని మార్చుకున్నట్లు కొన్ని పత్రాల పైన సంతకాలు పెట్టించుకున్నారన్నారు.
జూలై 30న బాధితురాలు తప్పించుకొని వచ్చి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వైద్య పరీక్షల్లో ఆమె పైన అత్యాచారం జరిగినట్లు రుజువైంది. బాధితురాలి పొట్ట పైన కత్తిగాట్లు కనిపించాయి. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. మత పెద్ద, ఆయన భార్య, కుమార్తెలను అరెస్టు చేశారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications