తండ్రి స్నేహితులే గ్యాంగ్ రేప్ చేశారు!.. బాలిక మృతి
లైంగిక దాడితో బాధిత బాలిక ఇన్ఫెక్షన్‌కు గురైందని, అందువల్లే బాలిక మరణించిందని పోలీసులు తెలిపారు.
కొచ్చి: గత సెప్టెంబర్‌లో తండ్రి స్నేహితుల చేతిలో గ్యాంగ్ రేప్‌కు గురైన 14ఏళ్ల బాలిక కొట్టాయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు కన్నుమూసింది. బాధిత బాలిక స్వగ్రామం కలమసెరీ.
చాన్నాళ్లుగా మెదడు మరియు వెన్నెముక సమస్యతో బాధపడుతున్న ఆ బాలిక.. వాటి నుంచి కోలుకుంటున్న సమయంలోనే ఆమెపై అత్యాచార దాడి జరిగింది. తండ్రి స్నేహితులైన కొంతమంది తాగుబోతులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ తర్వాత బాలిక ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో.. ప్రత్యేక చికిత్స నిమిత్తం కొట్టాయంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. లైంగిక దాడితో బాధిత బాలిక ఇన్ఫెక్షన్ గురైందని, అందువల్లే బాలిక మరణించిందని పోలీసులు తెలిపారు.
బాలల హక్కుల సంఘం నాయకులు ఫిర్యాదు మేరకు నిందితులైన రవి(49),రాజు(36),రాజేశ్(31) కలమసెరీ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఆ బాలిక తండ్రి కూడా ఇటీవలే అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications