లవర్స్ పైదాడి: ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ నగరంలో మరో దారుణం జరిగింది. లవర్స్ మీద దాడి చేసి ఇద్దరు యువతుల మీద ఐదు మంది యువకులు సామూహిక అత్యాచారం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
17,18 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులు వారి భాయ్ ఫ్రెండ్స్ తో కలిసి ముందక మెట్రో స్టేషన్ సమీపంలోని అమర్ విహార్ ప్రాంతంలోని నిర్జనప్రదేశంలోకి వెళ్లారు. అక్కడ కుర్చుని వారు మాట్లాడుకుంటున్న సమయంలో ఐదు మంది యువకులు అక్కడికి వెళ్లారు.
తరువాత యువతుల స్నేహితులను పట్టుకుని చితకబాదేశారు. వారిని పక్కకు లాక్కెళ్లి యువతుల మీద ఒకరి తరువాత ఒకరు సామూహిక అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారైనారు.

బాధితులు ఇద్దరూ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి నలుగురు యువకులను గుర్తించి అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఐదో నిందితుడిని గుర్తించామని, అయితే అతను మాయం అయ్యాడని పోలీసులు అన్నారు.
యువతులు నివాసం ఉంటున్న చోట ఐదు మంది నిందితులు నివాసం ఉంటున్నారని, అయితే యువతులకు వారితో పరిచయం లేదని పోలీసులు చెప్పారు. యువతులు వెలుతున్న విషయం గుర్తించి వారిని వెంబడించి గ్యాంగ్ రేప్ చేశారని, పోస్కో చట్టంతో పాటు వివిధ సెక్షల కింద కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications