సంచలనం: కల్బుర్గీ, గౌరీలను చంపింది ఒక్కరే?, అదే తుపాకీ!..

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటకలో దారుణ హత్యకు గురైన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ కీలక ఆధారాలను బయటపెట్టింది. కన్నడ సాహితీవేత్త, హేతువాది ఎంఎం కల్బుర్గీ హత్య, గౌరీ లంకేశ్ హత్య ఒకరి పనేనా? అన్న అనుమానాలకు ఈ ఆధారాలు బలం చేకూరుస్తున్నాయి.

ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ తో సహ 17 మందికి బందోబస్తు !

రెండు హత్యల్లోను అగంతకులు ఉపయోగించిన తుపాకీ ఒకటేనని తాజా దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. అప్పట్లో కల్బుర్గీని 7.65ఎంఎం కాలిబర్ స్వదేశీ పిస్టల్ తో కాల్చి చంపగా.. గౌరీ లంకేశ్ ను సైతం అదే తుపాకీతో హత్య చేశారని రెండు ఆయుధాల మధ్యా 80 శాతం సారూప్యత ఉందని ఫోరెన్సిక్ వర్గాలు చెబుతున్నాయి.

Gauri Lankesh, Kalburgi killed with same gun? Probe suggests so

కల్బుర్గీ, గౌరీ లంకేశ్ హత్యల్లో అగంతకులు ఒకే తుపాకీ ఉపయోగించడాన్ని బట్టి ఒకే ముఠాకు చెందిన వ్యక్తులే ఈ హత్యలకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇద్దరి హత్యలు ఒకే తరహాలో జరగడం, ఇద్దరిని పాయింట్ బ్లాక్ రేంజ్ లోనే కాల్చి చంపడం దీనికి బలం చేకూరుస్తోంది.
కాగా, గౌరీ లంకేశ్ హత్యకు సంబంధించి తమ ప్రాథమిక నివేదికను సిట్ నేడు ప్రభుత్వానికి అందించనుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Journalist-activist Gauri Lankesh and Kannada scholar M M Kalburgi were killed with the same 7.65mm country-made pistol, preliminary findings of the Forensic Sciences Laboratory have indicated.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి