ఆప్ ఆరోపణలపై స్పందించిన గౌతం గంభీర్.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండని కౌంటర్..

ఢిల్లీ : రెండు చోట్ల ఓటు హక్కు, రెండు ఓటర్ కార్డులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై బీజేపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించారు. తూర్పు ఢిల్లీ ఆప్ అభ్యర్థి అతిషి చేసిన ఫిర్యాదుపై ఘాటు సమాధానం చెప్పారు. ఓటు హక్కుకు సంబంధించిన విషయాలను ఎన్నికల సంఘం చూసుకుంటుందని, ప్రజలకు చేసిందేమీ లేనందునే ఆప్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.

ఆమ్ ఆద్మీ పార్టీకి విజన్ లేని కారణంగా గత నాలుగున్నరేళ్లలో ఢిల్లీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని గౌతం గంబీర్ ఆరోపించారు. విజన్ ఉన్నట్లయితే ఇలాంటి నీచ రాజకీయాలు చేసుండేవారు కాదని బదులిచ్చారు.

Gautam Gambhirs Strong Retort To AAP On Voter ID Controversy

రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న గంభీర్‌ను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలంటూ ఆప్ నేత అతిషి డిమాండ్ చేశారు. ఆయనకు రాజింద్రనగర్‌తో పాటు కరోల్‌బాగ్‌లోనూ గంభీర్‌కు ఓటు హక్కు ఉందని అతిషి ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+