ప్రణబ్‌ను కలిసిన గీత: భవిష్యత్ బాగుండాలని కేజ్రీ ఆకాంక్ష

న్యూఢిల్లీ: 15ఏళ్ల క్రితం తప్పిపోయి పాకిస్థాన్‌కు చేరి ఈది పౌండేషన్‌లో ఆశ్రయం పొంది, సోమవారం భారత్‌కు తిరిగొచ్చిన గీత భవిష్యత్ బాగుండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆకాంక్షించారు. మంగళవారం నాడు ఢిల్లీలో ఈది పౌండేషన్ ప్రతినిధులతో కలిసి గీత సీఎం కేజ్రీవాల్‌ను కలిసింది.

ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ సైగల ద్వారా గీతతో సంభాషించారు. గీత చురుకైన అమ్మాయి అని, ఆమె భవిష్యత్ బాగుండాలని ఆయన ఆకాంక్షించారు.

 Geeta Meets Delhi Chief Minister Arvind Kejriwal

రాష్ట్రపతి ప్రణబ్‌ను కలసిన గీత, ఈది ఫౌండేషన్ సభ్యులు

పాకిస్థాన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన గీత మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది. ఆమెతో పాటు ఈది పౌండేషన్ సభ్యులు రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా గీత భారత్-పాకిస్థాన్ దేశాల ఐక్యతకు గుర్తుగా ఉందంటూ రాష్ట్రపతి ట్వట్టర్‌లో ట్వీట్ చేశారు.

గీత తల్లిదండ్రులపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఆమెకు ఇండోర్‌లోని ప్రత్యేక పాఠశాలలో ఆశ్రయం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆ పాఠశాలలోని చిన్నారులు, సిబ్బంది గీత రాక కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, గీత తల్లిదండ్రులు ఎవరనే ఉత్కంఠ వీడేందుకు డీఎన్ఏ పరీక్ష ఫలితాల కోసం యావత్ భారతావని ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

డీఎన్ఏ పరీక్షలు పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకు గీత ఇండోర్‌లో ఉంటుందని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ సోమవారం వెల్లడించారు. ఇండోర్‌లోని డఫ్‌ బైలింగ్వల్‌ అకాడమీలో గీత ఆశ్రయం పొందుతుందని ప్రకటించారు. ఆ పాఠశాలలో సుమారు వంద మంది పిల్లలు ఉన్నారు. వారందరూ గీత లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+