వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీ ఛీఫ్ గా జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు-సాపర్స్ నుంచి సైన్యాధ్యక్షుడైన తొలి అధికారి

|
Google Oneindia TeluguNews

భారత దేశ సైన్యాధ్యక్షుడిగా జనరల్ మనోజ్ పాండే ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ ఈ హోదాలో ఉన్ జనరల్ ఎంఎం నరవణే స్థానంలో పాండే బాధ్యతలు చేపట్టారు. పాండే గతంలో ఆర్మీ వైస్ చీఫ్‌గా వ్యవహరించారు. లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతి రిటైర్ కావడంతో ఆయన స్థానంలో పాండే ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టారు.పాండే కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి ఇండియన్ ఆర్మీలో అత్యున్నత స్థానాన్ని పొందిన తొలి అధికారి కూడా. దీనిని 'సాపర్స్' అని కూడా పిలుస్తారు. 'సప్పర్స్' నుండి అధికారులు కమాండర్లు, వైస్ చీఫ్‌లుగా పనిచేశారు. కానీ ఎప్పుడూ సైన్యాధ్యక్షులుగా మాత్రం లేరు.

1962 మే 6న జన్మించిన మనోజ్ పాండే .. రెండేళ్ల పాటు 29వ ఆర్మీ చీఫ్‌గా కొనసాగనున్నారు. సర్వీస్ చీఫ్‌లకు మూడేళ్ల పదవీకాలం ఉంటుంది లేదా వారికి 62 ఏళ్లు వచ్చే వరకు సేవ చేస్తారు. వీటిలో ఏది ముందు అయితే అది రిటైర్మెంట్ కు వర్తిస్తుంది. దీని ప్రకారం 62 ఏళ్లు పూర్తి చేసుకునే పాండేకు రెండేళ్ల పదవీకాలం మాత్రమే ఉంది.

General Manoj Pande is new army chief, here is profile of General MM Naravanes successor

చైనాతో నిరంతర ప్రతిష్టంభనతో పాటు సరిహద్దుల్లో భారత్ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పాండే ప్రపంచంలోని అతిపెద్ద సైన్యాలలో ఒకటైన భారత సైన్య పాలనను చేపట్టబోతున్నారు. అలాగే భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో పోరాటం కోసం త్రివిధ దళాలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది మిలిటరీ హార్డ్‌వేర్ స్వదేశీీకరణపై నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా పాండే నియామకం జరిగింది. ఉక్రెయిన్‌పై పోరులో రష్యా ఎదురుదెబ్బల నేపథ్యంలో మిలటరీ హార్డ్ వేర్ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

దేశంలోని మూడింట రెండు వంతుల సైనిక పరికరాలు సోవియట్ లేదా రష్యా మూలానికి చెందినవి కావడంతో ఈ విషయంలో భారతదేశ సైనిక సంసిద్ధత గట్టిగానే ఉంది. తదుపరి ఆర్మీ వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు మే 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. క్వాలిఫైడ్ హెలికాప్టర్ పైలట్, లెఫ్టినెంట్ జనరల్ రాజు ప్రస్తుతం ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ హోదాలో సున్నితమైన లడఖ్ సెక్టార్‌లో చైనాతో సరిహద్దు ప్రతిష్టంభనను పర్యవేక్షిస్తున్నారు.

ఇవాళ తెల్లవారుజామున సైన్యం జనరల్ నరవాణే కార్యాలయంలోని చివరి రోజు ఫోటోలను ట్వీట్ చేసింది. ఆయన నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించడం, ఢిల్లీ సౌత్ బ్లాక్‌లోని పచ్చిక బయళ్లపై గౌరవ వందనం స్వీకరించడం ఇందులో కనిపిస్తోంది. జనరల్ తో పాటు అతని భార్య వీణా నరవణే కూడా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరియు ఆయన భార్య సవితా కోవింద్‌లను కలిశారు.

English summary
general manoj pande has appointed as new army chief of india after current chief general mm naravane.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X