UTS యాప్ లోని R-Wallet ద్వారా టికెట్స్ బుక్ చేసుకుంటే ఇన్ని లాభాలా..!
ఇంట్లో ఉండే ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఐఆర్‌సీటీసీ. ఇదే కాకుండా మరో యాప్ యూటీఎస్ ద్వారా ట్రెయిన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో అన్ రిజర్వుడ్ టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అయితే UTS మొబైల్ యాప్ లో డిజిటల్ పేమెంట్స్ ను ప్రారంభించింది రైల్వే శాఖ. ఆర్- వ్యాలెట్ ద్వారా రైల్వే టికెట్లు కొనుగోలు చేస్తే 3 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చని పేర్కొంది. ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రయాణికులు R-Wallet, Paytm, PhonePe, Googlepay, UPI యాప్‌లు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి డిజిటల్ మోడ్‌ల ద్వారా చెల్లింపు చేయవచ్చు. R-Wallet UTS యాప్‌లో అందుబాటులో ఉంటుంది, దీనిలో రూ.20,000 పరిమితి వరకు డిపాజిట్ చేయవచ్చు. అయితే యాప్ లోని R-Wallet ద్వారా కొనుగోలు చేసిన టిక్కెట్లపై 3% క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.
2016లో UTS ప్రారంభం..
UTS మొబైల్ యాప్ ను తొలిసారిగా 2016లో హైదరాబాద్ పరిధిలోని 26 సబ్ అర్బన్ స్టేషన్లలో రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత జులై, 2018 నుండి దేశవ్యాప్తంగా అన్ని స్టేషన్లలో ఈ యాప్ సేవలను విస్తరించింది. ప్లాట్‌ఫామ్, ప్రయాణ, సీజన్ టిక్కెట్లను ఈ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ యాప్ ఉపయోగించుకోవాలంటే ప్రయాణికుడు రైల్వేస్టేషన్‌కు 25-30 మీటర్ల దూరంలోనే ఉండాలి. స్మార్ట్‌ఫోన్‌లో జీపీఎస్ ఆన్‌లో ఉండాలి. ఒకేసారి 4 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. రైలు టికెట్లు మాత్రమే కాదు.. ప్లాట్‌ఫామ్ టికెట్స్, మంత్లీ పాస్ కూడా తీసుకోవచ్చు.












Click it and Unblock the Notifications