Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఘజియాబాద్ బాలికల ఆత్మహత్య కేసు.. ముగ్గురు భార్యల కథ.. షాకింగ్ ట్విస్ట్ లు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వస్తున్నాయి. ఈ కేసులో ముందు డిజిటల్ వ్యసనంతో ఫోన్లు లాక్కున్నారని ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని భావించగా, దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ కేసు దర్యాప్తు కొత్త మలుపులు తిరుగుతోంది.

ముగ్గురిని పెళ్లి చేసుకున్న బాలికల తండ్రి

బాలికల తండ్రి చేతన్‌కుమార్‌ ఇచ్చిన వాంగ్మూలాలు పోలీసులను షాక్ కు గురి చేస్తున్నాయి. అతను చెప్పినవి వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. తాను పెళ్లి చేసుకున్న ముగ్గురు మహిళలు సోదరీమణులని అతడు తొలుత చెప్పాడు. కానీ అతని భార్యలు ముగ్గురు అక్క చెల్లెళ్ళు కాదని దర్యాప్తులో తేలినట్లు పేర్కొన్నారు. మూడో భార్య టీనా 2018లో చేతన్ దగ్గర ఉద్యోగం చేసేదని, తర్వాత వారి పెళ్లి చేసుకున్నట్టుగా గుర్తించారు.

Ghaziabad sisters suicide case father said the story of three wives shocking twists in this deaths case

చేతన్ మూడు పెళ్ళిళ్ళపై దర్యాప్తు

అప్పటికే చేతన్ కు రెండు పెళ్లిళ్లు జరిగినట్టు నిర్ధారించారు. అయితే అతడిని విచారిస్తున్న క్రమంలో అతను 2010లో సుజాతను, సంతానం లేకపోవడంతో 2013లో హీనా ను వివాహం చేసుకున్నట్టుగా పేర్కొన్నాడు. కానీ మొదటి భార్యకు పదహారేళ్ల కుమార్తె ఉండడంతో చేతన్ వాంగ్మూలం పైన అధికారులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతని వివాహ పత్రాల ద్వారా మూడు వివాహాల తేదీల పైన దర్యాప్తు జరుపుతున్నారు.

చేతన్ వాంగ్మూలం పొంతన లేకపోవటంతో దర్యాప్తులో గందరగోళం

మరోవైపు 2015లో చేతన్ తో సహజీవనం చేసిన ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా వెల్లడయింది. ముగ్గురు అక్క చెల్లెల ఆత్మహత్య కేసులో, తండ్రిగా చెప్పబడే చేతన్ వివాహాలకు సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి రావడంతో పాటు, అతను ఇచ్చిన వాంగ్మూలం పొంతన లేకుండా ఉండడంతో దర్యాప్తులో మరింత గందరగోళం చోటుచేసుకుంది. అసలు చేతన్ ఎందుకు ఇలా చెబుతున్నాడు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్యలకు ముందు బాధితుల ఫోన్లు విక్రయం

త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో నివసించిన వారు ఘటన సమయంలో అందరూ ఒకే గదిలో ఎందుకు నిద్రించారు అన్నది కూడా అనుమానస్పదం గానే ఉంది. చేతన్ ఆర్థిక సమస్యల కారణంగా పిల్లలను స్కూల్ మాన్పించాం అని చెప్పగా, ఆత్మహత్య చేసుకోవడానికి కొద్ది రోజులు ముందు బాధితులు వారి ఫోన్లను అమ్మేయడం అనేక సందేహాలకు దారితీస్తుంది.

ఫోన్స్ లో ఏముందో రికవరీ చేస్తున్న పోలీసులు

దీంతో అసలు వారి ఫోన్లలో ఏముంది అనేది తెలుసుకోవడం కోసం పోలీసులు టెక్నాలజీ సహాయంతో రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఏం జరిగింది అన్నది తెలుసుకోవడానికి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఊహించని ట్విస్టులతో, అనుకోని మలుపులతో ఈ కేసు పోలీసులకు పెద్ద సవాల్ విసురుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+