ఆమె పేరు సిఎస్ గా తెరపైకి,డిఎంకె ఆమె సలహలు పాటించేది, ప్రజారోగ్యం సక్సెస్
తమిళనాడు రాష్త్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించిన గిరిజ వైద్యనాథన్ నిజాయితీ పరురాలు, ప్రతిభావంతమైన అధికారిగా పేరుంది.అయితే మాజీ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ వెంకటరామన్ కూతురు ఆమె.
చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో ప్రజా రోగ్యం విజయవంతం కావడంలో ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాద్యతలు స్వీకరించిన గిరిజ వైద్యనాథన్ కీలక పాత్ర
పోషించారు. అనుహ్యంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గిరిజ వైద్యనాథన్ ఎంపికైంది.
చంద్రమౌళి పేరుతో పాటు గిరిజ వైద్యనాథన్ పేరును కూడ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది. అయితే చంద్రమౌళి కంటే గిరిజ వైద్యనాథన్ వైపే ముఖ్యమంత్రి
పన్నీర్ సెల్వం మొగ్గుచూపారు.అత్యంత ప్రతిభావంతురాలిగా ఆమెకు పేరుంది.
అవినీతికి ఆమడ దూరంలో ఉండేవారు. ప్రజా రోగ్యం, విద్యారంగంలో చేపట్టిన పథకాలు విజయవంతం కావడంలో ఆమె చేసిన కృషి కీలకమైందిన తమిళనాడు
ప్రభుత్వ అధికారుల్లో ప్రచారంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీమ్ కూడ తమిళనాడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల తీరును అథ్యయనం చేసింది.తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి నేతృత్వంలో బృందం మూడు రోజుల పాటు చెన్నైలో పర్యటించింది.
ప్రభుత్వ ఆసుపత్రులు కార్పోరేట్ ఆసుపత్రుల తరహలో సేవలు అందించేలా రూపుదిద్దుకోవడానికి ఆమె కారణమైందనే ప్రచారం ఉంది.ఆమె నిర్వహించిన అనేక శాఖల్లో తన మార్కును చూపారు.ఈ మేరకే సిఎం పన్నీర్ సెల్వం ఆమెను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారని చెబుతున్నారు.
అన్నాడిఎంకె అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆమెతో పాటు మరో ఏడుగురు సీనియర్లు ఉన్నప్పటికీ జూనియర్ ఐఎఎస్ అధికారిగా ఉన్న రామ్మోహన్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జయలలిత నియమించారు. ఈ నియామకం కూడ వివాదాస్పదమే అయింది.
డిఎంకె అధికారంలో ఉన్న కాలంలో ఆమె ఆలోచనలను , సూచనలను ప్రభుత్వం పాటించిందని చెబుతారు. ఈ కారణం కూడ ఆమెను దూరం పెట్టేందుకు దోహదపడిందనే ప్రచారం కూడ లేకపోలేదు. ప్రచారానికి, అవినీతికి ఆమె దూరంగా ఉంటారు. విద్య, వ్యవసాయం, రవాణ, ప్రణాళిక విభాగం, ఆరోగ్యం, విద్య శాఖల్లో ఆమె పనిచేశారు.
తనకు కేటాయించిన శాఖల్లో నిజాయితీగా సమర్థవంతంగా పనిచేయడమే ఆమెకు ఈ పదవిని తెచ్చింది. అయితే ఎస్ బాస్ అనే తరహ మనస్థత్వం కాదు ఆమెది. ఈ కారణంగా కూడ ఆమెకు నష్టం కల్గించాయనే ప్రచారం కూడ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది.
మద్రాసు ఐఐటీ నుండి హెల్త్ ఎకనామిక్స్ లో పట్టభద్రురాలైన ఆమె రిజర్వ్ బ్యాంకు ఇండియా మాజీ గవర్నర్ ఎస్. వెంకటరామన్ కుమార్తె. ఆయన 1990 నుండి 1992 వరకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా పనిచేశారు. బిజెపి నాయకుడు, నటుడు ఎష్ వి శేఖర్ సతీమణికి గిరిజ సోదరి.












Click it and Unblock the Notifications