15 ఏళ్ల కూతురితో తండ్రి ఘాతుకం, ఫ్రెండ్ రేప్ చేశాడు

శనివారం నాడు ఢిల్లీ మెట్రో స్టేషన్ బయట ఆమె ఆవేదనతో కూర్చుంది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను పలువురు పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు.
పోలీసులు ఆమెను విషయం అడిగారు. తాను తన ఇంటి నుండి పారిపోయి వచ్చినట్లు చెప్పింది. తన తండ్రి, తన స్నేహితుడు తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని అందుకే తాను ఇంటి నుండి పారిపోయి వచ్చినట్లు తెలిపింది.
బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం... ఆమె స్నేహితుడు బాలికను బుద్ధ గార్డెన్‌కు తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అతను బాలికను హెచ్చరించాడు.
ఈ ఘటన అనంతరం ఆమె ఇంటికి వచ్చింది. తన తండ్రి తనను వేధించాడని చెప్పింది. తన తండ్రి ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నాడని, ఇంటికి తాగి వచ్చి, తనను వేధించాడని తెలిపింది. అతను తన ఒళ్లో కూర్చొని తన ప్రయివేటు భాగాలను ముట్టుకోవడం చేశాడని ఆరోపించింది.
దాంతో తాను ఆందోళన చెంది, అడ్డుకునే ప్రయత్నం చేశానని చెప్పింది. ఇలా చేస్తే కుటుంబ సభ్యులకు చెబుతానని తండ్రిని బెదిరించానని, దీంతో అతను తనను తీవ్రంగా కొట్టాడని ఆరోపించింది. దీంతో తాను ఇంటి నుండి పారిపోయి వచ్చానని పోలీసులకు తెలిపింది.












Click it and Unblock the Notifications