Hostel: ప్రభుత్వ హాస్టల్ లో ఉండే ఇంటర్ అమ్మాయి 7 నెలల గర్బవతి, వార్డెన్ సైలెంట్ ?
బెంగళూరు/చిక్కమగళూరు: ప్రభుత్వ స్కూల్స్, కాలేజ్ ల్లో చదువుతున్న పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం హాస్టల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం అమ్మాయిలు, అబ్బాయిల కోసం ప్రత్యేక హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. ఇంటర్ చదువుతున్న కాలేజ్ అమ్మాయిల కోసం ఓ హాస్టల్ ఉంది. ప్రభుత్వ హాస్టల్ లో చదువుతన్న ఓ మైనర్ అమ్మాయి 7 నెలల గర్బవతి అని వెలుగు చూడటం కలకలం రేపింది. ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ సైలెంట్ గా ఉండిపోవడంతో అసలు మ్యాటర్ బయటకు రాలేదు.

ప్రభుత్వ హాస్టల్
కర్ణాటకలోని చిక్కమగళూరులో సిటీలో కాలేజ్ అమ్మాయిల కోసం ప్రభుత్వం గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తోంది. ఇదే హాస్టల్ లో సుమారు 200 మందికి పైగా అమ్మాయిలు ఉన్నారు. హాస్టల్ లో ఉంటున్న అమ్మాయిలు ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి సాయంత్రం తిరిగి హాస్టల్ కు చేరుకుంటున్నారు.

ఇంటర్ అమ్మాయి
ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ అమ్మాయికి రోజురోజుకు కడుపు ఎక్కువ రావడంతో హాస్టల్ వార్డెన్ కు తెలిసి జిల్లా అధికారులు ఆ విషయం బయటకు రాకుండా చేశారు. అయితే ఇంటర్ అమ్మాయి దళితురాలు కావడం, మ్యాటర్ లీక్ కావడంతో దళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో విషయం వెలుగు చూసింది.

అమ్మాయి ఊర్లో బాయ్ ఫ్రెండ్ ?
అమ్మాయిని ఆమె సొంత గ్రామానికి పంపించామని అధికారులు అంటున్నారు. కాలేజ్ అమ్మాయి నివాసం ఉంటున్న గ్రామంలో ఓ యువకుడితో ఆమె ప్రేమలో ఉందని అధికారులు చెబుతున్నారు. కాలేజ్ అమ్మాయి నివాసం ఉంటున్న గ్రామంలో నివాసం ఉంటున్న సురేష్ అనే యువకుడి కారణంగా ఇంటర్ అమ్మాయి గర్బవతి అయ్యిందని పోలీసులు అంటున్నారు.

హాస్టల్ లో ఏం జరిగింది ?
కాలేజ్ అమ్మాయి హాస్టల్ కు రాకముందే గర్బవతి అయ్యిందని, హాస్టల్ లో అలాంటి సంఘన జరగడానికి అవకాశం లేదని అధికారులు వాదిస్తున్నారు. ప్రభుత్వ లేడీస్ హాస్టల్ లో ప్రతిమూడు నెలలకు ఒకసారి అమ్మాయిలకు వైద్యపరీక్షలు చెయ్యాలని నియమాలు ఉన్నాయని అమ్మాయి బంధువులు అంటున్నారు.

ప్రియుడు ఎస్కేప్
చిక్కమగళూరులోని హాస్టల్ ఉంటున్న అమ్మాయిలకు వైద్యపరీక్షలు చెయ్యలేదని, అలా చేసి ఉంటే ఈ విషయం ఎప్పుడో బయటకు వచ్చేదని, ఇప్పుడు ఆ అమ్మాయి 7 నెలల గర్బిణి అయ్యిందని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. కాలేజ్ అమ్మాయి నివాసం ఉంటున్న గ్రామంలోని సురేష్ మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, నిందితుడు పరారైనాడని చిక్కమగళూరు పోలీసు అధికారులు అంటున్నారు. ప్రభుత్వ హాస్టల్ లోని ఇంటర్ అమ్మాయి గర్బవతి అయ్యిందని వెలుగు చూడటం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications