డిప్రెషన్: తుపాకీతో కాల్చుకుని యువతి ఆత్మహత్య
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబకలహాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ 18ఏళ్ల యువతి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఖరాడ్ గ్రామంలో చౌదరి మన్సబ్ అలీ కుటుంబం నివాసం ఉంటోంది. చౌదరి కూతురికి రేష్మ చౌదరి అనే ఓ కూతురు ఉంది.

కాగా, గత కొంతకాలంగా రేష్మ కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రేష్మ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications