జాబ్ ఇప్పిస్తానని చెప్పి.. 40రోజులపాటు రేప్ చేశాడు
జైపూర్: రాజస్థాన్‌లోని సంగానేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 18 ఏళ్ల యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 40రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు.
వివరాల్లోకి వెళ్తే.. మే 27న ష్యోపూర్‌కు చెందిన 18 ఏళ్ల యువతి ఇంటి నుంచి అదృశ్యమైంది. అదే రోజు గిరిరాజ్ బైర్వా అనే కాంట్రాక్టర్‌ను కలిసి ఉద్యోగం కావాలని అడిగింది.
ఇదే అదునుగా భావించిన కాంట్రాక్టర్ ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి నుంచి 40 రోజుల పాటు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

కాగా, నిందిత కాంట్రాక్టర్ నుంచి ఎలాగోలా తప్పించున్న బాధిత యువతి, సోమవారం పోలీసులను ఆశ్రయించింది. నిందిత కాంట్రాక్టర్ తనకు మత్తు పదార్థాలు ఇచ్చి ప్రతి రోజూ అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది.
యువతి దేహం నిండా గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించిన పోలీసులు, నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications