మృతి: పరీక్షకు వెళ్తూ కూతురు, శవాన్ని తెస్తూ పేరెంట్స్

ముంబై: మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోలో విషాద ఘటన చోటు చేసుకుంది. గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. నాలుగు గంటల వ్యవధిలో జరిగిన ప్రమాదాల్లో వీరందరూ మృత్యువాత పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. హెచ్ఎస్సి విద్యార్థిని ధహనశ్రీ కదమ్(17) సెట్(కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) హాజరయ్యేందుకు గురువారం ఉదయం తన తండ్రి ఆటో రిక్షాలో పరీక్షా కేంద్రానికి బయల్దేరింది. మార్గమధ్యలో సంగమేశ్వర్ (ముంబై నుంచి గోవా వెళ్లే హైవే) వద్ద అదుపుతప్పిన ఆటో బోల్తా కొట్టింది. ధహనశ్రీ ఆటోలో నుంచి బయటపడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను రత్నగిరి పట్టణ సివిల్ ఆస్పత్రికి తరలించారు.

Girl dies on road, parents killed after collecting body

ధహనశ్రీ కదమ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆమె మృతదేహాన్ని ఖేడ్‌లోని తమ నివాసానికి అంబులెన్స్‌లో తరలించారు. ఆ అంబులెన్స్ వెంట ఆమె తల్లిదండ్రులు ప్రవీణ్(40), ప్రియాంక కదమ్(38)లు బంధువు నరేష్ దేవర్(50)తో కలిసి ఓ మారుతి కారులో వెళ్లారు. కాగా, ట్రెయిలర్‌పై తీసుకెళుతున్న ఓ భారీ జెసిబి యంత్రం ప్రమాదవశాత్తు వీరు ప్రయాణిస్తున్న కారుపై పడింది. దీంతో ప్రవీణ్, ప్రియాంకలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

తొలి ప్రమాదం జరిగిన సంగమేశ్వర్‌కు కేవలం రెండు కిలో మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. ఒకే రోజు కుటుంబ సభ్యులు ముగ్గురు మృతి చెందడంతో ఖేడ్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రవీణ్ ఎవరికి ఆపద వచ్చిన సాయం చేసేందుకు ముందుండేవాడని గ్రామస్తులు తెలిపారు. అతడు ఎంఎన్ఎస్ (మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన) కార్యకర్త అని, పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవాడని చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎంఎన్ఎస్ నాయకులు ఘటన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రెయిలర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+