వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ అందానికి రూ.4లక్షల పుట్టగొడగులు: అల్పేష్‌కు తైవాన్ యువతి కౌంటర్

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్/తైపీ: ప్రధాని నరేంద్ర మోడీపై గుజరాత్ ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు ఓ తైవాన్ యువతి కౌంటర్ ఇచ్చింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్న ప్రధాని మోడీ అందంపై అల్పేష్ పలు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Recommended Video

మ‌ష్రూమ్ @ 80K : మోదీ తింటున్నారంట, మీక్కూడా కావాలా ?

మోడీ రోజుకు రూ.4లక్షల విలువైన పుట్టగొడుగులను తైవాన్ నుంచి తెప్పించుకు తింటున్నాడని, అందుకే ఆయన మేని ఛాయ మరింత కాంతివంతమైందని అల్పేష్ ఠాకూర్ విమర్శలు చేశారు.

 మా దేశాన్ని ఎందుకు లాగారంటూ..

మా దేశాన్ని ఎందుకు లాగారంటూ..

ఈ క్రమంలో తమ దేశాన్ని ఎందుకు లాగుతున్నారంటూ అల్పేష్ ఠాకూర్‌కు ఓ తైవాన్ యువతి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు తైవాన్‌కు చెందిన మెస్సీ జోయ్ అనే యువతి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. అలాంటి పుట్టగొడుగులు తమ దేశంలోనే లేవని తేల్చి చెప్పింది.

అల్పేష్‌కు తైవాన్ యువతి కౌంటర్

‘నా పేరు మెస్సీ జోయ్. నేను తైవాన్ వాసిని. ఈ రోజు ఇండియా నుంచి వచ్చిన ఓ వార్తను చదివాను. ఓ భారత నేత మాట్లాడుతూ.. తైవాన్‌లో ఒక్కో మాష్రూమ్(పుట్టగొడుగు) 1,200 డాలర్లకు లభిస్తుందని, అది తింటే.. చర్మం రంగు మారుతుందని చెప్పారు. అటువంటి పుట్టగొడుగులు మా దేశంలో ఉన్నట్లు ఇంత వరకు వినలేదు. అసలది అసాధ్యం కూడా. మీ దేశ రాజకీయాల్లోకి మా దేశాన్ని ఎందుకు లాగుతున్నారు' అంటూ ఆమె నిలదీసింది.

మోడీ రంగు తేలారంటూ.. అల్పేష్ వ్యాఖ్యలు

కాగా, గుజరాత్ ఎన్నికల సభలో అల్పేష్ మాట్లాడుతూ.. 35ఏళ్ల వయస్సులో మోడీ నల్లగా ఉండేవారని, ఇప్పుడు చాలా రంగు తేలారని అన్నారు. ఇందుకు రోజుకు రూ.4లక్షల విలువైన నాలుగు పుట్ట గొడుగులను తైవాన్ నుంచి తెప్పించుకుని తింటున్నాడని తెలిసిందని అల్పేష్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే మెస్సీ వీడియో పెట్టడంతో ఆ ఆరోపణలపై స్పష్టత వచ్చినట్లయింది.

 14న రెండో దశ ఎన్నికలు.. గట్టిపోటే

14న రెండో దశ ఎన్నికలు.. గట్టిపోటే

డిసెంబర్ 9న తొలిదశ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 14న రెండో తుది దశ ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ మళ్లీ అధికారం చేపడుతుందని ఇప్పటికే పలు ఓపీనియన్ సర్వేలు తేల్చాయి. అయితే, ఇంతకుముందులా కాకుండా కాంగ్రెస్ నుంచి బీజేపీకి గట్టి పోటీ తప్పదని పేర్కొన్నాయి.

English summary
Hours after newly-inducted Congress leader Alpesh Thakor stoked a controversy by saying that imported mushrooms that cost Rs 80,000 per piece are the secret behind PM Narendra Modi's 'fair skin', a Taiwanese woman has rejected the OBC leader's claims by saying that she hasn't heard of any such thing in her country adding that her country shouldn't be involved in Indian politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X