భోజనానికి పిల్చి యువతి 8 మంది రేప్, వీడియో తీసి..

లక్నో/కోల్‌కతా: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ముజఫర్ నగర్ జిల్లాలోని బస్తాడా గ్రామంలో ఓ ఇరవై ఏళ్ల యువతిని గత ఏడాది ఆగస్టులో ఆమె మిత్రుడు భోజనానికి ఆహ్వానించాడు. మార్గమధ్యంలో నలుగురు యువకులు వారిని అడ్డగించగా.. మిత్రుడు వారితో చేయి కలిపి ఆ యువతిని బెదిరించి నిర్జన ప్రదేశంలోకి తీసుకు వెళ్లారు.

అప్పటికే అక్కడ మరో ముగ్గురు ఉన్నారు. వారిలో ఐదుగురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మిగిలిన ముగ్గురు దానిని వీడియో తీశారు. ఆ తర్వాత మిగిలిన ముగ్గురు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోను ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించారు. దీంతో ఆమె బయటకు చెప్పలేదు.

Girl gang raped by youths, video uploaded on Facebook

అయితే, ఆ దుండగులు సదరు వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టారు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

మహరాజ్ గంజ్ జిల్లా రత్నాపూర్‌లో ఆరేళ్ల పాపను ఇద్దరు బాలురు ఎత్తుకుపోయి అత్యాచారం చేశారు. ఆ పైన ఆ చిన్నారిని నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి ఆవరణలో సజీవ సమాధి చేశారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+