
ఇదేంది సర్పంచ్.. యువతికి లైంగిక వేధింపులు.. కాల్చి పడేసింది...
అతను గ్రామ సర్పంచ్.. ఊరికి ప్రథమ పౌరుడు. అందరినీ బిడ్డల్లా చూడాలీ. కానీ వక్రబుద్ది చూపించాడు. లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ఇంకేముంది ఆగ్రహించిన యువతి.. అతనిని షూట్ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఇన్సిడెంట్‌తో కన్నౌజ్ జిల్లా జలాల్పూర్ అమ్రా గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
గ్రామ సర్పంచ్ భర్త రామ్‌సరన్.. కొందరినీ వేధిస్తున్నాడు. గ్రామానికి చెందిన యువతిని గత రెండుళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమెపై భౌతిక దాడికి దిగుతూ హింసిస్తున్నాడు. గత కొద్దీ రోజులుగా రామ్‌సరన్ అరాచకం ఎక్కువయ్యింది. అతని బాధను యువతి భరించలేకపోయింది. ఈ విషయాన్ని తన సోదరునికి, తల్లికి చెప్పింది. ముగ్గురు కలిసి రామ్‌సరన్ హతమార్చాలని పథకం పన్నారు. పంచాయితీ చేయాలని ఆదివారం బాధిత యువతి సోదరుడు.. రామ్‌సరన్‌ను ఇంటికి తీసుకొచ్చాడు. కొద్దీ సేపు అతడితో మాట్లాడాడు. మాట్లాడుతున్న సమయంలోనే యువతి రామ్‌సరన్‌ను వెనక నుంచి నాటు తుపాకీతో కాల్చింది.

అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హత్య తర్వాత యువతి, ఆమె సోదరుడు.. ఫరూఖాబాద్‌కు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రామ్‌సరన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువతి హత్య చేసినట్లు నిర్దారించారు. ఫరూఖాబాద్‌లో ఉన్న యువతిని, ఆమె సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యువతిని విచారించారు.
జరిగిన విషయాన్ని యువతి తెలిపింది. గత రెండేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని.. సహకరించకపోతే ఇంట్లో వాళ్ళని చంపుతా అని బెదిరిస్తున్నాడని.. వేధింపులు ఎక్కువ కావడంతో హత్య చేశానని తెలిపింది. యువతి, ఆమె సోదరుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.