ఇంట్లోంచి లక్షలెత్తుకెళ్లి ఫ్రెండ్స్‌తో అమ్మాయి ఎంజాయ్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ అమ్మాయి తన ఇంటి నుంచి రూ.38 లక్షలు దొంగిలించి, స్నేహితులతో కలిసి డూన్ వెళ్లిపోయి సరదాగా గడిపింది. ఆ అమ్మాయి వయస్సు కేవలం పద్నాలుగు. తన కుమార్తె కనిపించడం లేదని ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ఓ బిల్డర్.
డబ్బులతో కుమార్తె మాయమైన మరుసటి రోజే ఆమె స్నేహితులు నలుగురు మాయమయ్యారు. దీంతో తన కుమార్తెనే డబ్బులు దొంగిలించిందని భావించిన ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాఫ్తు చేసి వారిని ట్రేస్ చేసి క్షేమంగా పట్టుకున్నారు.
వారితో పాటు రూ.37 లక్షలు రికవరీ చేశారు. మిగిలిన లక్ష రూపాయలను వీరు 12 గంటల వ్యవధిలో ఖర్చు చేశారు. చదువు పేరిట తనపై ఒత్తిడి అధికమైనందునే కొంతమార్పు కోరుకుంటూ ఈ పని చేసినట్టు ఆ అమ్మాయి వెల్లడించింది.

డీసీపీ మన్‌దీప్ మాట్లాడుతూ... స్నేహితుల ప్రోద్బలంతో ఆమె దొంగతనం చేసిందన్నారు. వీరు స్మార్ట్‌ఫోన్ యాప్ మాధ్యమంగా ఓ టాక్సీని బుక్ చేసుకుని తొలుత నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారని, ఆపై అక్కడ రైళ్లు లేవని తెలుసుకుని అదే టాక్సీలో డెహ్రాడూన్ వెళ్లి, అక్కడి ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో దిగారని తెలిపారు.
విచారణలో భాగంగా, టాక్సీ డ్రైవర్‌కు ఫోన్ చేస్తే, నలుగురిని తాను డెహ్రాడూన్‌లో దింపి రూ.11 వేల బిల్ తీసుకున్నట్లు చెప్పారు.
అతనిని తిరిగి అదే హోటలుకు వెళ్లి హోటల్ యాజమాన్యంతో మాట్లాడించాలని కోరామని, వారు రూ.10 వేల విలువైన లగ్జరీ సూట్ బుక్ చేసుకున్నారని, ఉదయం నుంచి సాయంత్రం లోగా రూ.80 వేల విలువైన షూస్, బ్యాగ్స్, డ్రస్సులు కొనుక్కున్నారని చెప్పారు. హోటల్ సహకారంతో వారిని పర్యవేక్షణలో ఉంచామని, ప్రత్యేక బృందాన్ని పంపి వారిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications