రూమ్మేట్స్ నగ్న ఫొటోలు తీసి రహస్యంగా ప్రియుడికి.. విషయం బయటపడేసరికి..
ఓ అమ్మాయి ప్రియుడి కోసం రహస్యంగా తన స్నేహితురాళ్ల నగ్న ఫోటోలను తీసి పంపింది. విషయం కాస్తా భయటపడేసరికి.. భయంతో ఆమె, ఆమె ప్రియుడు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.
ముంబై : ఓ అమ్మాయి ప్రియుడి కోసం రహస్యంగా తన స్నేహితురాళ్ల నగ్న ఫోటోలను తీసి పంపింది. విషయం కాస్తా భయటపడేసరికి.. భయంతో ఆమె, ఆమె ప్రియుడు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని కళ్యాణ్ పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
ముంబై మిర్రర్ కథనం ప్రకారం... సెయింట్ జార్జ్ ఆస్పత్రిలో నర్సింగ్ విద్యనభ్యసిస్తున్న వృశాలి లండే(21) స్థానికంగా ఓ హస్టల్‌లో ఉంటోంది. అక్కడే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేసే సురేశ్ అనే యువకుడితో చనువుగా ఉండేది. వీరిద్దరి మధ్య రోజు ఫోన్ సంభాషణలు కొనసాగుతుండేవి.

ఓ రోజు వృశాలి తన ఇద్దరు రూమ్‌మేట్స్‌కి తెలీకుండా వారి నగ్న ఫోటోలు తీసి సురేశ్‌కు పంపింది . అయితే వారిద్దరి మధ్య జరిగిన ఛాటింగ్‌ను ఓ అమ్మాయి చదవటంతో విషయం కాస్తా బయటపడింది.
సురేశ్ బలవంతం మేరకే తాను ఆ పని చేశానని వృశాలి ఒప్పేసుకోవటంతో.. అలా ఓ పేపర్ మీద రాసిచ్చి ఇకపై సురేశ్‌తో మాట్లాడటం మానేయాలని, లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆమె రూమ్మేట్స్ హెచ్చరించి వదిలేశారు.
అయితే ఆ తరువాత కూడా వృశాలి అతనితో మాట్లాడటం మానలేదు. సెప్టెంబర్ 23న ఈ ఫొటోల విషయమై వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా, వృశాలి కోపంగా హస్టల్ నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం అయినా తిరిగి రాకపోవటంతో హస్టల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీస్ విచారణలో వృశాలి రూమ్మేట్స్ ఇద్దరూ జరిగినదంతా వివరించారు. కానీ, అప్పటికే వృశాలి, ఆమె ప్రియుడు సురేశ్ ఇద్దరూ సమీపంలోని స్టేషన్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మర్నాడు వృశాలి గది నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications