మూడేళ్ళలో 34 సార్లు పాము కాటు, 18 ఏళ్ళ యువతి ఇలా...వైద్యులు అలా.
మూడేళ్ళలో 34 సార్లు 18 ఏళ్ళ మనీషా అనే యువతి పాము కాటుకు గురైంది.అయితే పాము కాటుకు గురైనా ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం వాటిల్లలేదు. మరోసారి పాము కాటుకు గురై ఆసుపత్రిలో చేరింది.
హిమాచల్ ప్రదేశ్:పాము కరిస్తే బతకడం కష్టం. సకాలంలో వైద్య చికిత్స అందిస్తే మాత్రం ప్రాణాలు దక్కుతాయి.అయితే ఒక్కసారి కాదు ఏకంగా 34 సార్లు 18 ఏళ్ళ మనీషాను పాము కరిచింది.అయితే ఆమెకు ఏమికాలేదు. ఆమె మాత్రం అందిరిలాగానే హయిగా జీవిస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీమౌర్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ళ మనీషాకు మూడేళ్ళలో 34 సార్లు పాము కరిచింది.తాను చిన్నతనంలో స్కూల్ కు వెళ్ళే సమయంలో తొలిసారి పాము కరిచిందని ఆమె చెప్పారు. ఒక్కో సారి రోజుకు రెండు లేదా మూడు సార్లు కూడ పాము కరిచిన ఘటనలు కూడ ఉన్నాయని ఆమె గుర్తు చేసుకొన్నారు.

పాము కాటుకు గుైన తనకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని ఆమె చెప్పారు. తనకు నాగదేవతకు ఏదో సంబంధం ఉండడం వల్లే పాము కాటు వల్ల తనకు ప్రాణహని కలగడం లేదని ఆమె అభిప్రాయపడుతోంది. అయితే నాగదేవతకు మనీషాకు ఏదో సంబంధం ఉందని ఈ కారణంగానే మనీషాకు హని కలగగడం లేదని జ్యోతిష్యులు, పూజాలు చెప్పారని ఆమె ప్రస్తావిస్తున్నారు.
విషం లేని, తక్కువ విషం ఉన్న పాములు కరవడం వల్లే మనీషాకు ప్రాణాపాయం వాటిల్లలేదని వైద్యులు చెబుతున్నారు. మెడికల్ రిపోర్టుల ప్రకారంగా ఈ ఏడాది ఫిబ్రవరి 18వరకు మనీషాకు 34 సార్లు పాములు కురిచినట్టుగా గుర్తించారు.
పాము కాటుకు గురై ఫిబ్రవరి 18వ, తేదిన ఆమె ఆసుపత్రిలో చేరిందని మెడికల్ కాలేజీ హస్పిటల్ సూపరింటెండ్ డాక్టర్ వైఎస్ చెప్పారు. ప్రస్తుతం మనీషా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారాయన.
మనీషా పాము కాటకు గురి కావడం వల్లే ఆసుపత్రిలో జాయిన్ అయిందని చెప్పారు. అయితే మనీషాకు కరిచిన పాముకు విషం లేదని గుర్తించినట్టుగా ఆయన చెప్పారు. ఇక్కడ ఉండే పాముల్లో 80 శాతానికి పైగా పాముల్లో విషం ఉండదని డాక్టర్ కెకె ప్రసాద్ తెలిపారు.
మనీషా పాము కాటుకు గురి కావడం రోటీన్ అయిందన్నారు. ఆమె తండ్రి సుమెర్ వర్మ చెబుతున్నారు. అయితే తరచూ పాములు కరవడం తో మనీషా శరీరంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పెరిగి పాము కాటు నుండి తప్పించుకొనే ప్రక్రియ ఉత్పన్నమౌతోందని హిమాచల్ ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ రోహిత్ చెప్పారు.












Click it and Unblock the Notifications