Girlfriend: కాస్ట్లీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఇంజనీర్ ఏం చేశాడంటే ?, ఎంత సంపాధించాడంటే, మిస్టర్ 420 !

ముంబాయి/ నాగ్ పూర్: సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకుడు మంచి ఉద్యోగం చెయ్యాలని ప్రయత్నించాడు. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినా అతని తెలివితేటలు అంతంతమాత్రంగా ఉండటంతో ఉద్యోగం రాలేదు. తరువాత సివిల్ కాంట్రాక్టర్ అవతారం ఎత్తిన ఆ యువకుడు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. చాలా కాస్ట్లీ కోరికలు ఉన్న గర్ల్ ఫ్రెండ్ చిక్కింది. గర్ల్ ఫ్రెండ్ కోరికలు తీర్చడానికి అతని సంపాధన సరిపోలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా కారు కచ్చితంగా ఉండాలి. సామాన్యమైన రిసార్టుల్లో ఉండటానికి అతని గర్ల్ ఫ్రెండ్ నిరాకరించింది. అంతే ఫ్రెండ్ తో కలిసి రెచ్చిపోయి సులభంగా డబ్బులు సంపాధించాడు. ఫ్రెండ్ తో తేడా రావడంతో ఒక్కడే రంగంలోకి దిగాడు. శ్రీమంతురాలైన మహిళ మెడలో బంగారు మంగళసూత్రం లాక్కెళ్లడానికి ప్రయత్నించిన సివిల్ ఇంజనీర్ ను వెంటాడిన పోలీసులు చివరికి అతన్ని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఇంజనీర్ కు ఖరీదైన అపార్ట్ మెంట్ లో లక్షల రూపాయల విలువైన ఫ్లాట్, ఇంట్లో 45 బంగారు చైన్లు, బ్యాంకులో రూ. 20 లక్షలకు పైగా బ్యాంకు బ్యాలెన్స్ ఉందని తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు. కేవలం ప్రియురాలి కోసమే ఇంజనీర్ కిలాడి అవతారం ఎత్తడాని వెలుగు చూడటం కలకలం రేపింది.

 సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ?

సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ?

నాగ్ పూర్ లో ఉమేష్ పాటిల్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 2015లో ఉమేష్ పాటిల్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత మంచి ఉద్యోగం చెయ్యాలని ఉమేష్ ప్రయత్నించాడు. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినా ఉమేష్ కు తెలివితేటలు అంతంతమాత్రంగా ఉండటంతో అతనికి ఎక్కడా మంచి ఉద్యోగం రాలేదు.

 కాస్ట్లీ గర్ల్ ఫ్రెండ్ చిక్కింది

కాస్ట్లీ గర్ల్ ఫ్రెండ్ చిక్కింది

ఎక్కడా ఉద్యోగం రాకపోవడంతో తరువాత ఉమేష్ సివిల్ కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. తరువాత ఉమేష్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఉమేష్ కు చాలా కాస్ట్లీ కోరికలు ఉన్న గర్ల్ ఫ్రెండ్ చిక్కింది. గర్ల్ ఫ్రెండ్ కోరికలు తీర్చడానికి ఉమేష్ పాటిల్ కి అతను సంపాధన ఏమాత్రం సరిపోలేదు.

 ఫ్రెండ్ తో చైన్ స్నాచింగ్ లు

ఫ్రెండ్ తో చైన్ స్నాచింగ్ లు

ఉమేష్ కు కష్టపడి పని చెయ్యడం ఇష్టం లేదు. ఉద్దరగా డబ్బులు సంపాధించాలని ఉమేష్ ఆలోచించాడు. రెండు సంవత్సరాల క్రితం తుషార్ అనే వ్యక్తితో కలిసి ఉమేష్ చైన్ స్నాచింగ్ లు చెయ్యడం మొదలు పెట్టాడు. చైన్ స్నాచింగ్ లు చేసి ఆ నగలు విక్రయించి వచ్చిన సోమ్మును ఉమేష్, తుషార్ పంచుకుంటున్నారు. ఇలా ఉమేష్ అతని ప్రియురాలితో జల్సాలు చేస్తున్నాడు.

 ప్రియురాలి కోరికలు చూస్తే ?

ప్రియురాలి కోరికలు చూస్తే ?

ఉమేష్ ప్రియురాలు ఎక్కడికి వెళ్లాలన్నా కారు కచ్చితంగా ఉండాలి. సామాన్యమైన రిసార్టుల్లో ఉండటానికి ఉమేష్ గర్ల్ ఫ్రెండ్ నిరాకరించింది. అంతే ఫ్రెండ్ తుషార్ తో కలిసి రెచ్చిపోయిన ఉమేష్ సులభంగా డబ్బులు సంపాధించాడు. 2020లో తుషార్, ఉమేష్ ల మద్య డబ్బు పంపిణి విషయంలో తేడాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. తరువాత ఉమేష్, తుషార్ వేర్వేరుగా చైన్ స్నాచింగ్ లు చెయ్యడం మొదలు పెట్టారు.

 ఇంజనీర్ ను వెంటాడి పట్టుకున్న పోలీసులు

ఇంజనీర్ ను వెంటాడి పట్టుకున్న పోలీసులు

చాలా కాలంగా ఉమేష్ మీద పోలీసులు కన్నుపడింది. శ్రీమంతురాలైన మహిళ మెడలో బంగారు మంగళసూత్రం లాక్కెళ్లడానికి ప్రయత్నించిన సివిల్ ఇంజనీర్ ఉమేష్ ను వెంటాడిన పోలీసులు చివరికి అతన్ని పట్టుకున్నారు. చేజింగ్ లో పోలీసులకు, ఉమేష్ కు గాయాలైనాయి. అయినా ఉమేష్ ను మాత్రం పోలీసులు పట్టుకున్నారు.

 చైన్ స్నాచింగ్ లు చేసి ఎంత సంపాధించాడంటే ?

చైన్ స్నాచింగ్ లు చేసి ఎంత సంపాధించాడంటే ?

పోలీసుల విచారణలో సవిల్ ఇంజనీర్ ఉమేష్ కు ఖరీదైన అపార్ట్ మెంట్ లో రూ. 45 లక్షల రూపాయల విలువైన ఫ్లాట్, ఇంట్లో 45 బంగారు చైన్లు, బ్యాంకులో రూ. 20 లక్షలకు పైగా బ్యాంకు బ్యాలెన్స్ ఉందని తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు. కేవలం ప్రియురాలి కోసమే ఇంజనీర్ ఉమేష్ దొంగ అవతారం ఎత్తడాని వెలుగు చూడటం కలకలం రేపింది. ఉమేష్ కు ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అంటూ నాగ్ పూర్ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఖతర్నాక్ ఇంజనీర్ ఉమేష్ అరెస్టు అయ్యాడని తెలుసుకున్న అతని కాస్ట్లీ గర్ల్ ఫ్రెండ్ మాయం అయిపోయిందని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+