Girlfriend: వన్ సైడ్ లవ్, యువతి గొంతు చీల్చి, తలను సుత్తితో?, కత్తితో18 చోట్ల కోసిన శాడిస్టు !

కొచ్చి/తిరువనంతపురం: చదువు పూర్తి చేసిన యువతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తున్నది. ఫేమస్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న యువతికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. యువతి అమ్మమ్మ చనిపోవడంతో కుటుంబ సభ్యులు అందరూ అంత్యక్రియలకు వెళ్లారు. యువతి మాత్రమే ఇంటిలో ఉంది. అంత్యక్రియలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు హడలిపోయారు. యువతి గొంతు చీల్చి తల మీద సుత్తితో దాడి చేసి చేతులు, శరీరం మీద కత్తులతో కోసి హత్య చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. కూతురు హత్యకు గురికావడంతో ఆమె తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. యువతికి వచ్చిన చివరి ఫోన్ కాల్, సీసీటీవీ పుటేజీల దెబ్బతో యువతిని అతిదారుణంగా హత్య చేసిన కిరాతకుడు పోలీసులకు చిక్కిపోయాడు.

 ల్యాబ్ టెక్నీషియన్

ల్యాబ్ టెక్నీషియన్

కేరళలోని కన్నూరు జిల్లాలోని కూతుపెరంబు సమీపంలోని బన్నూరులో విష్ణుప్రియా అలియాస్ ప్రియా (23) అనే యువతి నివాసం ఉ:టున్నది. చదువు పూర్తి చేసిన విష్ణుప్రియా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తున్నది. ఫేమస్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న విష్ణుప్రియాకు పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

 యువతికి ఫోన్ చేసి మాట్లాడిన తల్లిదండ్రులు

యువతికి ఫోన్ చేసి మాట్లాడిన తల్లిదండ్రులు

ఈనెల 22వ తేదీన ప్రియా అమ్మమ్మ చనిపోవడంతో కుటుంబ సభ్యులు అందరూ అంత్యక్రియలకు వెళ్లారు. ఆ సందర్బంలో ప్రియా తి మాత్రమే ఇంటిలో ఉంది. అంత్యక్రియలు పూర్తి చేసుకున్న తరువాత ప్రియాకు ఆమె కుటుంబ సభ్యులు ఫోన్ చేసి మాట్లాడారు. అంత్యక్రియలు ముగించుకుని ఇంటికి వెళ్లారు.

 గొంతు చీల్చి.... సుత్తితో కొట్టి.... 18 చోట్ల కత్తిపోట్లు

గొంతు చీల్చి.... సుత్తితో కొట్టి.... 18 చోట్ల కత్తిపోట్లు

ఇంటి తలుపులు లాక్ చెయ్యకుండా తీసి ఉండటంతో ప్రియా కుటుంబ సభ్యులు ఆందోళనగా లోపలికి వెళ్లి చూస్తే ప్రియా రక్తపుమడుగులో ఇంట్లో శవమై కనిపించింది. ప్రియా గొంతు చీల్చి ఆమె తల మీద సుత్తితో దాడి చేసి చేతులు, శరీరం మీద 18 చోట్లకు పైగా కత్తితో కోసి హత్య చేశారని వెలుగు చూడటంతో ఆమె కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు.

 ప్రియా రిసీవ్ చేసిన చివరి ఫోన్ కాల్

ప్రియా రిసీవ్ చేసిన చివరి ఫోన్ కాల్

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ప్రియా శవాన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రియాను అతి కిరాతకంగా హత్య చెయ్యడంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. ప్రియా మొబైల్ ఫోన్ కు వచ్చిన చివరి ఫోన్ కాల్, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీల పరిశీలించిన పోలీసులు కూతుపరంబు ప్రాంతంలోని మనందేరిలో నివాసం ఉంటున్న శ్యామ్ జిత్ (27) అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

 వన్ సైడ్ లవ్ తో హత్య

వన్ సైడ్ లవ్ తో హత్య

విచారణలో ప్రియాను తానే దారుణంగా హత్య చేశానని కిరాతకుడు శ్యామ్ జిత్ అంగీకరించాడని పోలీసు అధికారులు చెప్పారు. తాను ప్రియాను ప్రేమించానని, ప్రియా తనను ప్రేమించలేదని, ఆమె ఎక్కడ తనకు దూరం అవుతుందో అనే కసితో తాను హత్య చేశానని శ్యామ్ జిత్ అంగీకరించాడని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు అంటున్నారు. వన్ సైడ్ లవర్ కాణంగా ఉద్యోగం చేస్తున్న కూతురు ప్రియా హత్యకు గురికావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+