Girlfriend: ఫ్రెండ్ మరదలితో రొమాన్స్, పెళ్లి చేసుకోవాలని అనుకుంటే షాక్, పొదల సీన్ !
చెన్నై/క్రిష్ణగిరి/పాట్నా: అందరూ యువకుడి కోసం గాలించారు. నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ సమీపంలోని ముళ్ల పొదల్లో కనపడకుండా పోయిన యువకుడు శవమై కనిపించాడు. యువకుడి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. పోలీసుల విచారణలో మరో యువకుడి మరదలు మ్యాటర్ బయటకు రావడంతో అందరూ బిత్తరపోయారు.

బీహార్ టూ తమిళనాడు
బీహార్ లోని మోజాపూర్ జిల్లాలో నివాసం ఉంటున్న శివిజ్ కుమార్ (22), పంగాజు బసువాన్ (25) అనే ఇద్దరు యువకులు తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా (బెంగళూరు గ్రామీ జిల్లా శివార్లలోని జిల్లా)కు చేరుకుని అపార్ట్ మెంట్ లో మేస్త్రీ పని చేస్తున్నారు. బీహార్ కు చెందిన ఇద్దరు యువకులు క్రిష్ణగిరిలోని నిర్మాణంలో ఉన్న ఒకే అపార్ట్ మెంట్ లో పని చేస్తున్నారు.

అపార్ట్ మెంట్ పక్కలో రూమ్
నిర్మాణంలో ఉ్నన్న అపార్ట్ మెంట్ సమీపంలోని ఓకే గదిలో శివిజ్ కుమార్, పంగాజు బసువాన్ నివాసం ఉంటున్నారు. అపార్ట్ మెంట్ లో పనిపూర్తి అయిన తరువాత కూలీలు అందరూ వెళ్లిపోయిన తరువాత సమీపంలోని రూమ్ లో ఉంటున్న శివిజ్ కుమార్, పంగాజు బసువాన్ అపార్ట్ మెంట్ లోని బిల్డింగ్ మెటీరియల్స్ ను భద్రంగా చూసుకుంటున్నారు.

మాయం అయిన యువకుడు
అపార్ట్ మెంట్ కాంట్రాక్టర్ జయకుమార్ కు ఫోన్ చేసిన శివిజ్ కుమార్ తనతోపాటు రూమ్ లో ఉన్న పంగాజు బసువాన్ రెండు రోజుల నుంచి కనిపించడంలేదని చెప్పాడు. కాంట్రాక్టర్ జయకుమార్ అపార్ట్ మెంట్ దగ్గరకు చేరుకున్నాడు. జయకుమార్ తో పాటు అపార్ట్ మెంట్ లో పని చేస్తున్న కూలీలు బసువాన్ కోసం గాలించారు.

శవమై కనిపించిన యువకుడు
నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ సమీపంలోని ముళ్ల పొదల్లో కనపడకుండా పోయిన యువకుడు బసువాన్ శవమై కనిపించాడు. బసువాన్ ను గొంతు కోసి దారుణంగా హత్య చేశారని వెలుగు చూసింది, క్రిష్ణగిరి పోలీసుల విచారణలో మరో యువకుడు శివిజ్ కుమార్ మీద డౌట్ వచ్చింది.

మరదలు మ్యాటర్ తో షాక్
శివిజ్ కుమార్, బసువాన్ ఒకే ప్రాంతం వాళ్లు కావడంతో ఇద్దరూ ఇరువైపుల కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఇదే సందర్బంలో శివజ్ కుమార్ మరదలితో ఫోన్ లో మాట్లాడుతున్న బసువాన్ ఆమెను మెల్లిగా లైన్ లో పెట్టాడు. ఊరికి వెలుతున్నానని శివిజ్ కుమార్ కు చెప్పిన బసువాన్ అతని ఊరికి వెళ్లి అతని మరదలితో రొమాన్స్ చేసి ఎంజాయ్ చేస్తున్నాడు.

పక్కాప్లాన్ తో చంపేశాడు
ఈ విషయం తెలుసుకున్న శివిజ్ కుమార్ బిత్తరపోయి అతని స్నేహితుడు బసువాన్ మీద పగతో రగిలిపోయాడు. ఎలాగైనా తన స్నేహితుడిని హత్య చేసి తన మరదలిని దక్కించుకోవాని స్కెచ్ వేశాడు. రాత్రి మందు పార్టీ ఇచ్చిన శివిజ్ కుమార్ అతని స్నేహితుడు బసువాన్ ను బయటకు పిలుచుకుని వెళ్లి కత్తితో అతని గొంతు కోసి చంపేశాడని పోలీసులు అన్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications