Girlfriends: ఒకేసారి ఇద్దరు లేడీస్ తో ప్రియుడు ?, సముద్రంలో దూకింది, ప్రియుడు ఫినిష్, లేడీ !
బెంగళూరు/ మంగళూరు: విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తున్న యువకుడు మంచి జీతం తీసుకునేవాడు. విదేశాల్లో ఉద్యోగం చేసే సమయంలోనే ఓ మహిళ ఆ యువకుడికి పరిచయం అయ్యింది. విదేశాల్లో ఉన్న యువకుడితో ఆమె నిత్యం టచ్ లో ఉంది. కోవిడ్ దెబ్బతో సొంత ఊరికి చేరుకున్న ఆ యువకుడు కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోయే వరకు మళ్లీ విదేశాలకు వెళ్లకూడదని డిసైడ్ అయ్యాడు. విదేశాల్లో ఉన్న టైమ్ లోనే పరిచయం అయిన మహిళతో సొంత ఊరు చేరుకున్న తరువాత ఆ యువకుడు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్న ఆ యువకుడు తరువాత మరో మహిళను పరిచయం చేసుకుని ఆమెతో కూడా శారీరక సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేశాడు. ఒకరికి తెలీకుండా ఒకరితో ఏడాది పాటు ఇద్దరితో రొమాన్స్ చేస్తున్న ఆ యువకుడు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. యువకుడి టైమ్ బాగాలేకపోవడంతో ఆ మ్యాటర్ ఇద్దరు మహిళలకు తెలిసిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు మహిళలు, వాళ్ల ప్రియుడి మద్య రచ్చరచ్చ అయ్యింది. ఇద్దరు ప్రియురాళ్లను రాజీ చెయ్యాలని అనుకున్న ప్రియుడు ఇద్దరిని బీచ్ లోకి పిలిపించాడు. ఆ సమయంలో ముగ్గురి మద్య వాడివేడిగా వాదనలు జరిగాయి. ఆ సమయంలో సహనం కోల్పోయిన ఒక ప్రియురాలు పరిగెత్తుకుంటూ వెళ్లి సముద్రంలో దూకేసింది. హడలిపోయిన ప్రియుడు వెంటనే సముద్రంలో దూకి ప్రియురాలిని రక్షించి ఆమెను ఒడ్డుకు చేర్చడానికి ప్రయత్నించాడు. స్థానికులు విషయం గుర్తించి ప్రియురాలిని బయటకు లాగేశారు. అయితే ప్రియురాలిని రక్షించడానికి సముద్రంలో దూకిన ప్రియుడి మాత్రం జలసమాధి అయ్యాడు. ఈ తతంగం మొత్తం బయట నుంచి చూస్తున్న మరో ప్రియురాలు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యింది. ప్రియురాలిని రక్షించడానికి ప్రయత్నించిన ప్రియుడి ప్రాణం పోవడంతో అతని కుటుంబ సభ్యులు హడలిపోయారు.

విదేశాల్లో ఉద్యోగం చేసిన యువకుడు
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఎరియూడుపాడులో డిసౌజా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అబుదాబిలో మంచి ఉద్యోగం రావడంతో కొన్ని సంవత్సరాల క్రితం డిసౌజా విదేశాలకు వెళ్లిపోయాడు .అప్పటి నుంచి అబుదాబిలో నివాసం ఉంటున్న డిసౌజా మంచి జీతం తీసుకుంటూ డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు.

ప్రియురాలిని సెట్ చేసుకున్నాడు
అబుదాబిలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే డిసౌజాకు సరిత (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ పరిచయం అయ్యింది. విదేశాల్లో ఉన్న డిసౌజాకు సరిత నిత్యం టచ్ లో ఉండేది. కోవిడ్ దెబ్బతో దక్షిణ కన్నడ జిల్లాలోని ఎరియపాడుకు చేరుకున్న ఆ యువకుడు కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోయే వరకు మళ్లీ విదేశాలకు వెళ్లకూడదని డిసైడ్ అయ్యాడు.

ప్రియురాలితో రొమాన్స్
సొంత ఊరు చేరుకున్న తరువాత డిసౌజా అతని ప్రియురాలు సరితను కలవడం మొదలు పెట్టాడు. నిత్యం కలుసుకుంటున్న డిసౌజా, సరిత ఏకాంతంగా గడపడం మొదులుపెట్టారు. అబుదాబిలో ఉన్న టైమ్ లోనే పరిచయం అయిన సరితతో సొంత ఊరు చేరుకున్న తరువాత డిసౌజా శారీరక సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు.

రెండో ప్రియురాలు ఎంట్రీ
సరితతో రొమాన్స్ చేస్తున్న సమయంలోనే డిసౌజాకు సోషల్ మీడియాలో అతను నివాసం ఉంటున్న సమీపంలోని ఊరిలో నివాసం ఉంటున్న సౌమ్యా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ పరిచయం అయ్యింది. సరితతో ఎంజాయ్ చేస్తున్న డిసౌజా అతని ప్రియురాలుకు తెలీకుండా సౌమ్యాను లైన్ లో పెట్టి ఆమెతో కూడా ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు.

ప్రియుడి మ్యాటర్ ఇద్దరికి తెలిసిపోయింది
ఒకరికి తెలీకుండా ఒకరితో ఏడాది పాటు ఇద్దరితో రొమాన్స్ చేస్తున్న డిసౌజా పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. డిసౌజా టైమ్ బాగాలేకపోవడంతో ఆ మ్యాటర్ ఇద్దరు మహిళలు సరిత, సౌమ్యాలకు తెలిసిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు మహిళలు, వాళ్ల ప్రియుడు డిసౌజా మద్య రచ్చరచ్చ అయ్యింది.

బీచ్ లో రాజీ చెయ్యాలని ప్రయత్నించిన ప్రియుడు
ఇద్దరు ప్రియురాళ్లు సరిత, సౌమ్యాలకు రాజీ చెయ్యాలని అనుకున్న ప్రియుడు ఇద్దరిని దక్షిణ కన్నడ జిల్లాలోని సోమేశ్వర బీచ్ లోకి పిలిపించాడు. ఆ సమయంలో డిసౌజా, అతని ప్రియురాళ్లు సరిత, సౌమ్యాల మద్య వాడివేడిగా వాదనలు జరిగాయి. ఆ సమయంలో సహనం కోల్పోయిన ఒక ప్రియురాలు పరిగెత్తుకుంటూ వెళ్లి సముద్రంలో దూకేసింది. హడలిపోయిన ప్రియుడు డిసౌజా వెంటనే సముద్రంలో దూకి ప్రియురాలిని రక్షించి ఆమెను ఒడ్డుకు చేర్చడానికి ప్రయత్నించాడు.

ప్రియుడి ప్రాణం పోయింది...... రెండో ప్రియురాలు ఎస్కేప్
స్థానికులు విషయం గుర్తించి డిసౌజా ప్రియురాలిని బయటకు లాగేశారు. అయితే ప్రియురాలిని రక్షించడానికి సముద్రంలో దూకిన ఆమె ప్రియుడి డిసౌజా సముద్రంలో మునిగిపోయాడు. డిసౌజాను రక్షించడానికి స్థానికులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే డిసౌజా జలసమాధి అయ్యాడు. ఈ తతంగం మొత్తం బయట నుంచి చూస్తున్న మరో ప్రియురాలు సోమేశ్వర బీచ్ లో నుంచి ఎస్కేప్ అయ్యింది. ఇద్దరు మహిళలతో రొమాన్స్ చేసిన ప్రియుడు డిసౌజా ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు డిసౌజా గర్ల్ ఫ్రెండ్స్ ను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications