పాఠశాల గుమస్తా నగ్నంగా ఫొటోలు తీశారని అమ్మాయిలు...
బరంపురం: బాలికల వసతి గృహాల్లో రక్షణ లేకుండా పోయింది. చదువుకోవడానికి పాఠశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్లో చేరిన విద్యార్థినుల ఆశలను గల్లంతు చేస్తూ అధికారులు అత్యంత నీచంగా ప్రవర్తించారు. తమను పాఠశాల గుమస్తా నగ్నంగా ఫొటోలు తీశాడని గుర్తించి వసతిగృహం విద్యార్థినులు సిగ్గుతో తలవంచుకున్నారు. తీవ్రంగా కలత చెందారు.
తమకు అక్కడ రక్షణ లేదని గ్రహించిన దాదాపు 60 మంది విద్యార్థినులు హాస్టల్ వదిలిపెట్టి గురువారం ఇంటి ముఖం పట్టారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రాంలోని గంజాం జిల్లా గుడియాలి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం హాస్టల్లోని ఆరు, ఏడు తరగతుల విద్యార్థినులను నిరుడు విహార యాత్రకు తీసుకుని వళ్లారు. ఆ సమయంలో విద్యార్థినులు నగ్నంగా ఉన్న సమయంలో పాఠశాల గుమస్తా వారిని సెల్‌ఫోన్‌తో చిత్రాలు తీశాడు.

ఆ విషయం ఇటీవల ప్రిన్సిపాల్ టి. అన్నపూర్ణ పాత్రకు తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ ఘటనపై విచారణకు ఆదేశించారు. స్కూల్ గుమస్తాకు హాస్టల్ వంట మనిషి సహకరించినట్లు విచారణలో తేలింది. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. అయితే, గుమస్తా పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. అతని కోసం గాలింపు తీవ్రం చేసినట్లు వారు తెలిపారు.
హాస్టల్‌లో మొత్తం 87 మంది విద్యార్థినులు ఉండగా వారిలో 60 మది ఇళ్లకు తిరుగు ముఖం పట్టారు. ప్రస్తంత 27 మంది విద్యార్థినులు మాత్రమే హాస్టల్‌లో ఉన్నారు. కనీసం 22 నగ్నంగా, అర్థ నగ్నంగా ఉన్న ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు. బాలికల రక్షణ కోసం హాస్టల్లో ఓ మహిళా కానిస్టేబుల్‌ను నియోగించారు. పాఠశాల గుమస్తా తులు భుయాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications