గోవాలో బీజేపీకి షాక్ ఇచ్చిన మిత్రపక్ష పార్టీ; టీఎంసితో పొత్తుకు సై.. మమతా బెనర్జీకి జై!!
2022 లో గోవాలో జరగనున్న ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే బిజెపి అగ్రనేతలు గోవాలో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించి గోవా ఎన్నికల్లో బిజెపి విజయం సాధించేలా గా పార్టీ శ్రేణులు పనిచేయాలని దిశానిర్దేశం చేస్తుంటే, గోవా ఎన్నికల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి సర్కార్ కు ఝలక్ ఇవ్వడం కోసం గోవా ఎన్నికల ను వేదికగా చేసుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలలో ఎంట్రీకి గోవా ఎన్నికలపై బాగా ఫోకస్ చేశారు.

మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో టీఎంసీ పొత్తు
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు నెలల్లో రెండవసారి గోవా పర్యటనకు రానున్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో పలు ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటన వారం రోజుల ముందు, ఆ పార్టీ మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (MGP)తో ఎన్నికల పొత్తు పెట్టుకున్నట్టు సమాచారం. గోవాలో బీజేపీకి షాక్ ఇచ్చిన మిత్రపక్ష పార్టీ టీఎంసీతో పొత్తుకు సై అంది.

డిసెంబర్ 13న గోవాలో పర్యటించనున్న మమతా బెనర్జీ.. సీట్ల సర్దుబాటుపై నిర్ణయం
మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ భారతీయ జనతా పార్టీకి దీర్ఘకాల మిత్రపక్షంగా ఉంది. అయితే, ఈసారి, గోవాలో 2022 శాసనసభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలని ఎంచుకుంది. మూలాధారాల ప్రకారం, డిసెంబర్ 13న గోవాలో పర్యటించనున్న మమతా బెనర్జీ ఎన్నికల్లో పోటీపై ఇరు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు ఒప్పందాన్ని అధికారికం చేసే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు లుయిజిన్హో ఫలేరియో మరియు మహువా మొయిత్రా సమక్షంలో ఈ కూటమి పై ప్రకటన వెలువడింది.

టీఎంసి, ఎంజీపీ పొత్తులు ఖరారు
మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ప్రెసిడెంట్ దీపక్ ధవలికర్ , మహువా మొయిత్రా మరియు లుయిజిన్హో ఫలేరోలను పనాజీలోని గోవా తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో కలిశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ- మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ కూటమి యొక్క బ్లూప్రింట్‌ను వివరించే బోర్డు తీర్మానంపై ఇరుపక్షాల మధ్య సంతకం చేయబడింది. భవిష్యత్ ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గోవాను సంస్కరించి, ప్రస్తుత అవినీతి పాలనా వ్యవస్థ బారి నుండి బయటకు తీసుకురావడానికి తృణమూల్ మాత్రమే బలీయమైన శక్తి. అందుకే, మేము, వారితో కూటమిని ఏర్పాటు చేస్తున్నాము అని మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ప్రెసిడెంట్ ధవలికర్ అన్నారు.

రెండు పార్టీల మధ్య ఒప్పందం .. బీజేపీకి టెన్షన్
తృణమూల్ కాంగ్రెస్ ట్వీట్ చేస్తూ, రాజ్యసభ ఎంపీ లుయిజిన్హో ఫలేరో మరియు గోవా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మహువా మొయిత్రా ఈరోజు మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ నాయకుడు దీపక్ ధవలికర్‌ను కలిశారని గోవా 2022 (ఎన్నికలు) కోసం కూటమి బ్లూప్రింట్‌ను వివరించే అధికారిక తీర్మానంపై రెండు పార్టీల మధ్య సంతకం చేయబడిందని పేర్కొంది. ఏది ఏమైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని ధీటుగా ఎదుర్కోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓ రకంగా గోవాలో బిజెపికి టెన్షన్ పుట్టిస్తున్నదనే చెప్పాలి.












Click it and Unblock the Notifications