Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గోవా బీచ్ గ్యాంగ్ రేప్ : జైల్లో నిందితులకు చుక్కలు చూపించిన తోటి ఖైదీలు.. దుస్తులు విప్పించి...

గోవా బీచ్ గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులుగా ఉన్న ముగ్గురు అండర్ ట్రయల్ ఖైదీలను తోటి ఖైదీలు వేధింపులకు గురిచేశారు. ఆ ముగ్గురినీ దుస్తులు విప్పించి.. నగ్నంగా వారితో గుంజీలు తీయించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జైలు అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

జైళ్ల శాఖ ఐజీ వెనాన్సియో ఫర్టడో మాట్లాడుతూ... 'ఈ ఘటనపై 24 గంటల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించాం. తోటి ఖైదీలే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిస్తే... జైలు నిబంధనల ప్రకారం వారిపై చర్యలు ఉంటాయి. ఐపీసీ సెక్షన్లు కూడా దీనికి వర్తిస్తాయా అనేది పరిశీలిస్తాం.ఇలాంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్న సంకేతాలు పంపించాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.' అన్నారు.

goa beach gang rape accused stripped and did sit ups by other prisoners in jail

ఒకవేళ ఈ ఘటనలో జైలు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తేలినా... వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వేధింపులకు గురైన ఆ ముగ్గురు నిందితులు గత నెలలో చోటు చేసుకున్న బీచ్ గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టయినవారిగా వెల్లడించారు. మరో నిందితుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అవడంతో... అతన్ని ప్రత్యేక బ్లాక్‌లో ఉంచినట్లు తెలిపారు.

గత నెలలో చోటు చేసుకున్న గోవా బీచ్ గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. గోవాలోని బెనౌలిమ్ బీచ్‌లో 10 మంది టీనేజర్లు పార్టీ చేసుకోగా... పార్టీ అనంతరం ఆరుగురు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. మరో నలుగురు మాత్రం ఆ రాత్రి అక్కడే ఉండిపోయారు. ఆ నలుగురిలో ఇద్దరు బాలికలు,ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఓ నలుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చారు. తాము పోలీసులం అని చెప్పి ఇద్దరు అబ్బాయిలను చితకబాదారు. ఆపై ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఈ ఘటనపై సీఎం ప్రమోద్ సావంత్ రియాక్షన్ వివాదాస్పదంగా మారింది.

'14 ఏళ్ల పిల్లలు రాత్రంతా బీచ్‌లో గడిపారంటే వారి తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పిల్లలు మాట వినట్లేదన్న కారణంతో ప్రభుత్వంపై,పోలీసులపై ఆ బాధ్యత వదిలేయడం సరికాదు.' అని సీఎం ప్రమోద్ సావంత్ వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు పిల్లల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలని... రాత్రిపూట ఆడపిల్లలను బయటకు పంపించరాదని అన్నారు.మైనర్లయితే మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పౌరులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం రాత్రిపూట ఆడపిల్లలను బయట తిరగవద్దని చెప్పడమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+