గోవాలో బీజేపీకి ఎదురు దెబ్బ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, మనోహర్ పారిక్కర్ నియోజక వర్గం !
పణజి: గోవాలో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న పణజి శాసన సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాదించింది. పణజి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సిద్దార్థ్ కుంకోలియంకర్ ను స్థానిక ఓటర్లు ఆదరించకపోవడంతో ఓడిపోయారు.
పణజి నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మనోహర్ పారిక్కర్ సీఎం అయ్యారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మనోహర్ పారిక్కర్ మరణించారు. మనోహర్ పారిక్కర్ మరణంతో ఖాళీ అయిన పణజి నియోజక వర్గంలో మే 19న ఉప ఎన్నికలు జరిగాయి.

మనోహర్ పారిక్కర్ మరణించడంతో ఆయన కుమారుడు ఉత్పల్ పారిక్కర్ కు బీజేపీ టిక్కెట్ కేటాయిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే బీజేపీ నాయకులు సిద్దార్థ్ కుంకోలియంకర్ కు టిక్కెట్ కేటాయించారు. మనోహర్ పారిక్కర్ కుమారుడికి టిక్కెట్ కేటాయించకపోవడంతో సానుభూతి ఓట్లు దూరం అయ్యాయి.
పణజిలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిద్దార్థ్ కుంకోలియంకర్ మీద పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అటానాసియో మోన్ఫ్ రట్స్ 1, 775 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాదించారు. గావాలో అధికారంలో ఉన్న బీజేపీకి పణజి ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications