Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Goa elections: తన తండ్రిపై చేసినట్టే తనపైనా కుట్ర; గోవాలో బీజేపీ పతనం తప్పదన్న ఉత్పల్ పారికర్

గోవా అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ గోవా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీని వీడి, వచ్చే నెలలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించిన గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్, పార్టీని వీడడం అత్యంత కష్టతరమైన నిర్ణయమని, అయితే తాను అందుకు రెడీ అయ్యే రాజీనామా చేశానని పేర్కొన్నారు. పనాజీ నియోజకవర్గం నుండి బిజెపి "మంచి అభ్యర్థి"ని నిలబెట్టినట్లయితే ఎన్నికల రేసు నుండి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పిన ఆయన ఆ పని బీజేపీ చెయ్యలేదని వెల్లడించారు.

పనాజీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఉత్పల్ పారికర్ పోటీ

పనాజీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఉత్పల్ పారికర్ పోటీ

ఉత్పల్ పారికర్ తన తండ్రి, పార్టీ కోసం క్రియాశీలకంగా పని చేసిన అనుభవజ్ఞుడు అయిన మనోహర్ పారికర్ రెండు దశాబ్దాలకు పైగా ప్రాతినిధ్యం వహించిన పనాజీ నియోజకవర్గం నుండి బిజెపి టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. ఉత్పల్ పారికర్ కు టికెట్ ఇవ్వడానికి బిజెపి నిరాకరించింది. ఈ నిర్ణయంపై కలత చెందిన పారికర్ శుక్రవారం బీజేపీని వీడి, ఫిబ్రవరి 14న జరిగే ఎన్నికల్లో పనాజీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు.

అటానాసియో మోన్సెరేట్‌ కు పనాజి టికెట్ ఇవ్వటంపై తీవ్ర అభ్యంతరం

అటానాసియో మోన్సెరేట్‌ కు పనాజి టికెట్ ఇవ్వటంపై తీవ్ర అభ్యంతరం

తనకు టిక్కెట్ నిరాకరించడం పట్ల బిజెపి కార్యకర్తలు చాలా మంది నిరాశతో ఉన్నారని ఉత్పల్ పారికర్ వెల్లడించారు. పనాజీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ప్రకటన చేశారు. 2019 జూలైలో కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిన పది మంది శాసనసభ్యులలో ఒకరైన తన సిట్టింగ్ ఎమ్మెల్యే అటానాసియో మోన్సెరేట్‌ను పనాజి నుండి బిజెపి నామినేట్ చేసింది. మైనర్‌పై అత్యాచారం కేసుతో సహా క్రిమినల్ కేసులను మోన్సెరేట్ ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఆయనకే టికెట్ కేటాయించడంపై పారికర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

మంచి అభ్యర్థిని నిలబెట్టినట్లయితే తానీ నిర్ణయం తీసుకునేవాడిని కాదన్న ఉత్పల్ పారికర్

మంచి అభ్యర్థిని నిలబెట్టినట్లయితే తానీ నిర్ణయం తీసుకునేవాడిని కాదన్న ఉత్పల్ పారికర్

మనోహర్ పారికర్ పెద్ద కుమారుడు ఉత్పల్, బిజెపి ఎల్లప్పుడూ తన హృదయంలో ఉందని, పార్టీ ఆత్మ కోసం పోరాడుతుందని అన్నారు. అటువంటి పార్టీని వీడాలనే నిర్ణయం తనకు అంత ఈజీ కాదన్నారు. ఇది చాలా కష్టమైన నిర్ణయం. నేను అలాంటి నిర్ణయం తీసుకోనవసరం లేదని ఆశించాను కానీ తప్పలేదన్నారు. పార్టీకి రాజీనామా చేసే నిర్ణయం తీసుకున్నందుకు తాను సంతోషంగా లేనని పార్టీ పనాజీ నుండి మంచి అభ్యర్థిని నిలబెట్టినట్లయితే తాను నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఉత్పల్ పారికర్ చెప్పాడు.

తన తండ్రిపై కుట్రలు చేసినట్టే తన మీద కూడా కుట్రలు

తన తండ్రిపై కుట్రలు చేసినట్టే తన మీద కూడా కుట్రలు

తనకు టిక్కెట్ నిరాకరించడం 1994లో తన తండ్రిని పార్టీ నుండి బయటకు పంపే ప్రయత్నాల మాదిరిగానే ఉందని పారికర్ మాటల ద్వారా అర్థమవుతుంది. చరిత్ర చూసిన వాడికి తాను చెప్పేది అర్థమవుతుందని, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ) ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బీజేపీ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయం అది.అప్పటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లకు తాను ఏమి చెబుతున్నానో తెలుస్తుందని.. ఆ సమయంలో మనోహర్ పారికర్‌కు ప్రజల మద్దతు లభించినందున ఆయనను బయటకు వెళ్ళగొట్టే లేక పోయారని ఆయన అన్నారు. ఆయనను వ్యతిరేకించినవారు చాలామంది ఇప్పటికీ ఉన్నత పదవిలో ఉన్నారని, కానీ తన తండ్రి మనోహర్ పారికర్ లాంటి వ్యక్తి "ప్రజలతో" ఉన్నారని పేర్కొన్నారు.

Recommended Video

    Elections: PM Modi Tops The List Of Global leaders| BJP | Oneindia Telugu
     గోవాలో బిజెపి పతనం అవుతోంది

    గోవాలో బిజెపి పతనం అవుతోంది


    తన తండ్రి మరణంతో 2019లో జరిగిన పనాజీ ఉపఎన్నికను ప్రస్తావిస్తూ, ఆ సమయంలో కూడా తనకు టిక్కెట్ నిరాకరించారని గుర్తు చేశారు. మద్దతు ఉన్నప్పటికీ తనకు టిక్కెట్ నిరాకరించబడిందని అన్నారు. గోవాలో బిజెపి "పతనం" అవుతోందని ఉత్పల్ పారికర్ అన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గోవాకు వచ్చినప్పుడు, ఐదు జంటలు పార్టీ టిక్కెట్లు కోరాయి అని, మనోహర్ పారికర్ జీవించి ఉంటే, ఏ ఒక్క మగ రాజకీయ నాయకుడు కూడా వారి భార్య ల కోసం టిక్కెట్ కోరే సాహసం చేసి ఉండేవాడు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తన తండ్రి ఎలా గళం విప్పారో ఉత్పల్ పారికర్ గుర్తు చేసుకున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+