Goa elections: తనకు అనుకూలంగా సైలెంట్ వేవ్ ఉంది: పనాజీలో ఉత్పల్ పారికర్ ధీమా

గోవాలో ఎన్నికల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ గోవాలో అధికార, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు మాటల తూటాలను పేలుస్తున్నారు. గోవా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవడం కోసం, ఓటర్ల మనసు గెలుచుకునేందుకు కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

 ప్రజలు తనవైపే ఉన్నారన్న ఉత్పల్ పారికర్

ప్రజలు తనవైపే ఉన్నారన్న ఉత్పల్ పారికర్


ముఖ్యంగా పనాజీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల పోరాటం బిజెపి వర్సెస్ ఉత్పల్ పారికర్ అన్నట్టుగా సాగుతుంది. బిజెపి నుండి ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి పనాజీ నియోజకవర్గం నుండి టికెట్ ఆశించిన గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పెద్ద కుమారుడు ఉత్పల్ పారికర్ కు టికెట్ నిరాకరించడంతో ఆయన బిజెపికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఇక ఎన్నికల ప్రచారంలో ప్రజలు తన వైపు ఉన్నారని, తనకు అనుకూలంగా సైలెంట్ వేవ్ వుందని ఉత్పల్ పారికర్ వెల్లడించారు.

 మోన్సెరేట్‌పై ఉత్పల్ పోటీ ... బీజేపీలో టెన్షన్

మోన్సెరేట్‌పై ఉత్పల్ పోటీ ... బీజేపీలో టెన్షన్

బిజెపి పై తన పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. పారికర్ సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్యే అటానాసియో మోన్సెరేట్‌పై పోటీ చేస్తున్నారు.2019లో మనోహర్ పారికర్ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో మోన్సెరేట్ బిజెపి అభ్యర్థిని ఓడించారు. ఆ తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మోన్సెరేట్ భార్య జెనిఫర్ పొరుగున ఉన్న తలైగావో నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే కాగా, వారి కుమారుడు పనాజీ మేయర్ గా ఉన్నాడు. స్థానికంగా రాజకీయంగా బలంగా ఉన్న మోన్సెరేట్ ను ఉత్పల్ పారికర్ ఈ ఎన్నికల్లో ఢీకొట్టబోతున్నారు

 ప్రజలు, కార్యకర్తల మద్దతుతోనే ఎన్నికల బరిలో ఉన్నానన్న ఉత్పల్ పారికర్

ప్రజలు, కార్యకర్తల మద్దతుతోనే ఎన్నికల బరిలో ఉన్నానన్న ఉత్పల్ పారికర్

2019లో స్థానిక రాజకీయాల కారణంగా నాకు టిక్కెట్ నిరాకరించబడిందని ఆ సమయంలో కూడా తాను పార్టీ నిర్ణయాన్ని అంగీకరించాలని, కానీ దారుణమైన ఆరోపణలు ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ నుండి తీసుకువచ్చి టిక్కెట్ ఇవ్వడాన్ని తన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని పారికర్ అన్నారు. 2016లో జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అటానాసియో మోన్సెరేట్‌ను ఉద్దేశించి పారికర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంతో కష్టపడి (నాన్న) పెంచి పోషించిన ఈ నియోజకవర్గాన్ని అటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తి చేతికి ఇవ్వడం అంగీకరించలేక పోయారని, ఎలా ప్రశాంతంగా ఉండగలను అని అన్నారు. అందుకే ప్రజలు, కార్యకర్తల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చిందని ఉత్పల్ పారికర్ వెల్లడించారు.

 తనకు అనుకూలంగా సైలెంట్ వేవ్ ఉంది : ఉత్పల్ పారికర్

తనకు అనుకూలంగా సైలెంట్ వేవ్ ఉంది : ఉత్పల్ పారికర్

పనాజీలోని ఖరీదైన శివారు ప్రాంతం, ప్రభుత్వ కాలనీలు, ముఖ్యమంత్రుల నివాసాలు, ముఖ్యమంత్రులు మరియు ఉన్నతాధికారుల నివాసాలు ఉన్న అల్టిన్హోలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన " తనకు అనుకూలంగా నిశ్శబ్ద తరంగం ఉంది" అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదేమైనా బిజెపికి గట్టి పోటీ ఇస్తున్న ఉత్పల్ పారికర్ కు గోవా ప్రజల నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+