వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Goa Polls: కాంగ్రెస్ వీడి వెళ్ళిన ఆ ఎమ్మెల్యేకు ఆఫర్; తృణమూల్ కు షాకిస్తూ నెలరోజుల్లోనే రాజీనామా!!

|
Google Oneindia TeluguNews

గోవా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. గోవా ఎన్నికలపై ప్రధాన పార్టీలన్నీ గోవాపై ఫోకస్ పెట్టాయి. అయితే ఈ సమయంలో గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన కాంగ్రెస్ నేత మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ రాజీనామా చేశారు.

తృణమూల్ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన అలెక్సో రెజినాల్డో లారెన్కో

తృణమూల్ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన అలెక్సో రెజినాల్డో లారెన్కో

కాంగ్రెస్ నుండి తృణమూల్ కాంగ్రెస్‌లోకి మారిన నెల రోజుల తర్వాత, గోవా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు, గోవా మాజీ ఎమ్మెల్యే అలెక్సో రెజినాల్డో లారెన్కో ఆదివారం మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీకి గుడ్ బై చెప్పారు. అలెక్సో రెజినాల్డో లారెన్కో కర్టోరిమ్ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీకి మరియు రాష్ట్ర అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆయన గోవా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలో ఉన్నారు.

ఏ కారణం చెప్పకుండా రాజీనామా చేసిన మాజీ కాంగ్రెస్ నేత

ఏ కారణం చెప్పకుండా రాజీనామా చేసిన మాజీ కాంగ్రెస్ నేత

తృణమూల్‌ కాంగ్రెస్ ను వీడాలనే తన నిర్ణయాన్ని తెలియజేస్తూ మమతా బెనర్జీకి పంపిన లేఖలో అలెక్సో రెజినాల్డో లారెన్కో ఎలాంటి కారణం చెప్పలేదు. అలెక్సో రెజినాల్డో లారెన్కో టీఎంసీకి రాజీనామా చేసిన వెంటనే లారెన్కోను కాంగ్రెస్‌లోకి తిరిగి రావాలని బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన నాయకుడు మైఖేల్ లోబో ఆహ్వానించారు. తృణమూల్ కాంగ్రెస్ ఒక ప్రకటనలో అలెక్సో రెజినాల్డో లారెన్కో రాజీనామాను ధృవీకరించింది.

మళ్ళీ కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ .. కర్టోరిమ్ స్థానం నుండి పోటీ

మళ్ళీ కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ .. కర్టోరిమ్ స్థానం నుండి పోటీ

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఏఐటీసీకి అలీక్సో రెజినాల్డో లారెన్కో లేఖ అందింది. మా వద్ద పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసే చాలా మంది నాయకులు ఉన్నారు. అలెక్సో రెజినాల్డో లారెన్కో ను అలాగే పార్టీలోకి స్వాగతించాము. ఇప్పుడు ఆయన నిష్క్రమించాలని కోరుకుంటున్నారు. మేము ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అని పార్టీ గోవా ఇన్‌ఛార్జ్ మహువా మొయిత్రా అన్నారు.

అలెక్సో రెజినాల్డో లారెన్కో తిరిగి కాంగ్రెస్‌లో చేరవచ్చునన్న సంకేతాలు వస్తున్నాయి. ఆయన అంతకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడే ముందు ఆయన ముందు పార్టీ ప్రకటించిన విధంగా కర్టోరిమ్ స్థానం నుండి పోటీ చేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఆయన నిష్క్రమణ తర్వాత కర్టోరిమ్ స్థానానికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థిని ప్రకటించలేదు.

కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఎంసీలో చేరిన నెలరోజుల్లోనే మళ్ళీ రాజీనామా

కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఎంసీలో చేరిన నెలరోజుల్లోనే మళ్ళీ రాజీనామా

ఏది ఏమైనప్పటికీ, అలెక్సో రెజినాల్డో లారెన్కో రాజీనామా చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. నమ్మక ద్రోహం చేసే వ్యక్తులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని, ఓటర్లు వారికి సరియైన గుణపాఠం నేర్పుతారని పేర్కొంది. కర్టోరిమ్ అసెంబ్లీ స్థానం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన లారెన్కో ఇటీవలే గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు.

అయినప్పటికీ గోవాలో ఉన్న రాజకీయ పరిస్థితులతో గోవాలో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు లేకపోవటంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తర్వాత టీఎంసీ నుండి ఎన్నికల బరిలోకి దిగుతాడని భావించిన సమయంలో ఊహించని విధంగా ఆయన మళ్ళీ రాజీనామా చెయ్యటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

English summary
Congress leader Aleixo Reginaldo Lourenco, who joined the Trinamool Congress ahead of the Goa assembly polls, has resigned, shocking the party again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X