ఎఫైర్: 15 రోజులు ప్రియులతో ఎంజాయ్, అడ్డుగా ఉన్నాడని భర్త హత్య,
పనాజీ: ఒక్కరు కాదు నలుగురితో వివాహేతర సంబంధం పెట్టుకొన్న వివాహిత నలుగురు ప్రియులతో కలిసి తన భర్తను చంపించింది. వివాహేతర సంబంధాల గురించి తెలిసిన భర్త ఈ విషయమై మందలించడమే పాపంగా మారింది. దీంతో తన వ్యవహరానికి భర్త అడ్డుగా మారుతాడని భావించి దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటన గోవా రాష్ట్రంలో చోటు చేసుకొంది.
వివాహేతర సంబంధాలు భార్య, భర్తల మధ్య సంబంధాలను దెబ్బతీస్తున్న ఘటనల గురించి మనం వినే ఉంటాం. ఈ తరహ ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. వివాహేతర సంబంధాల కోసం భర్తలను హత్య చేసే భార్యల ఘటనలకు సంబంధించిన వార్తలు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.
ఇదే తరహా ఘటన గోవా రాష్ట్రంలో చోటు చేసుకొంది. టాక్సీ డ్రైవర్‌గా పనిచేసే బసవరాజ్ విధి నిర్వహణలో నెలలో 15 రోజులు ఇంటికి దూరంగా ఉంటారు. అయితే దీన్ని ఆసరాగా తీసుకొన్న భార్య కల్పన బారి వివాహేతర సంబంధాలను కొనసాగించింది.ఈ వివాహేతర సంబంధాలే చివరకు భర్త ప్రాణాలు తీసేందుకు కారణంగా మారాయి.

నలుగురు లవర్స్ తో భర్తను చంపించిన భార్య
కర్ణాటక రాష్ట్రంలోని బైహుంగళ్ ప్రాంతానికి చెందిన కల్పన బారిని బసవరాజ్ వివాహం చేసుకొన్నాడు. బసవరాజ్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు అయితే విధి నిర్వహణ నిమిత్తం బసవరాజ్ గోవాలోని కుర్‌చోరెం ప్రాంతంలో నివాసం ఉండేవాడు. టాక్సీ డ్రైవర్‌గా పనిచేసే బసవరాజ్ నెలలో పదిహేను రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. పదిహేను రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండేవాడు. అయితే ఈ సమయంలో కల్పన బారి నలుగురు వ్యక్తులతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ విషయం ఇటీవల భర్త బసవరాజ్‌కు తెలిసింది. దీంతో అతను భార్యను మందలించాడు. దీంతో నలుగురు ప్రియులతో కలిసి భార్య భర్తను హత్య చేయించింది.

నలుగురితో వివాహేతర సంబంధం
నెలలో 15 రోజుల పాటు ఇంటికి భర్త బసవరాజు దూరంగా ఉండడంతో కల్పన బారి ఇదే అవకాశంగా తీసుకొని సురేష్ కుమార్, పంకజ్ పవార్, అబ్దుల్ షేక్, ఆదిత్య గుజ్జర్ లతో వివాహేతర సంబంధాలను కొనసాగించింది. ఈ విషయాలు ఒకరికి తెలియకుండా మరోకరితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగించిందని పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషయం ఎట్టకేలకు భర్త బసవరాజ్ కు తెలిసింది.

భర్తకు తెలిసిందని చంపాలని ప్లాన్
తన భార్య వివాహేతర సంబంధాలు తెలిసిన బసవరాజు భార్యను తీవ్రంగా మందలించాడు. ఈ విషయమై పద్దతిని మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు. అయితే భర్త బతికి ఉంటే తన కు ఇబ్బందులు ఎదురౌతాయని భావించిన కల్పన నలుగురు ప్రియులతో తన భర్తను హత్యచేయాలని ప్లాన్ చేసింది. విధులను ముగించుకొని ఇంటికి వచ్చిన భర్త నిద్రలో ఉండగా నలుగురు ప్రియులు ఇంటికి వచ్చారు. నిద్రలోనే బసవరాజ్ ను హత్య చేశారు.మృతదేహన్ని మూడు ముక్కలుగా నరికారు. మూడు గన్నీ బ్యాగుల్లో పెట్టి దూద్ సాగర్ ప్రాంతంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేశారు.

బసవరాజ్ అదృశ్యంపై విచారణ చేస్తే షాకైన పోలీసులు
బసవరాజ్ అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేస్తే దిమ్మ తిరిగే నిజాలను తెలుసుకొన్నారు. భార్యే భర్త బసవరాజ్ ను ప్రియులతో కలిసి హత్య చేయించిందని పోలీసులు విచారణలో కనుగొన్నారు. దీంతో భార్య కల్పనతో పాటు ఆమె నలుగురు ప్రియులను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications