గోఎయిర్ సూపర్ ఆఫర్: టికెట్ ప్రారంభ ధర కేవలం రూ.599

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: దేశీయ ఎయిర్‌లైన్ సంస్థ గో ఎయిర్ విమాన ప్రయాణికులకు ఓ సూపర్ ఆఫర్ ప్రకటించింది. సమ్మర్ సేల్ తర్వాత మాన్‌సూన్ ఆఫర్ పేరిట గో ఎయిర్ భారీగా ధరలను తగ్గించింది. మాన్‌సూన్ క్యాంపెయిన్ పేరుతో రూ.599తో టికెట్ ప్రారంభ ధరలను శుక్రవారం ప్రకటించింది.

మే 12 నుంచి మే 15, 2017 అర్ధరాత్రి వరకు ఈ డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉండనున్నాయని ఆ సంస్థ తెలిపింది. జూలై 01-సెప్టెంబర్ 30, 2017 మధ్య కాలంలో ప్రయాణానికి టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. తమ నెట్ వర్క్‌లో నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

 GoAir announces Monsoon offer with fares starting at Rs 599

23సెక్టార్లలో గో ఎయిర్ ఎయిల్‌లైన్స్ నడుపుతున్న విమానాళ్లో ప్రయాణికులకు ఈ తక్కువ ఛార్జీలను అందిస్తుంది. ఒకసారి టికెట్ బుక్ చేసిన తర్వాత రద్దు చేసుకుంటే మాత్రం ఎలాంటి డబ్బులు తిరిగి చెల్లించబడవని స్పష్టం చేసింది. కాగా, గో ఎయిర్ ఇంతకుముందు సమ్మర్ స్పెషల్ సేల్ పేరుతో రూ.899 ప్రారంభ ధరతో ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Budget carrier GoAir has announced its 'Monsoon' sale with fares starting at just Rs 599, the company said.
Please Wait while comments are loading...