Viral Video ఎమోషన్స్ మనకే కాదు జంతువులకు కూడా ఉంటాయి.. యజమానిని కౌగిలించుకుని ఏడ్చిన మేక..
ఎమోషన్స్ ఒక్క మనిషికే కాదు జంతువులకు కూడా ఉంటుంది. ముఖ్యంగా పెంపుడు జంతువులకు ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి మనుషులకు దగ్గరగా ఉంటాయి. అందుకే వాటికి మనికి ఏదో తెలియన బంధం ఏర్పడుతుంది. కుక్క, పిల్లి వంటి వాటిని సరదాకోసం పెంచుకుంటే.. ఆవు, మేక, గుర్రం వంటి జంతువులను తమ ఉపాధి కోసం పెంచుకుంటారు. ఈ క్రమంలో వాటికి మనకి చిన్నపాటి బంధం ఏర్పడుతుంది.

మనిషిలా ఎడ్చేసింది..
కొందరైతే పెంపుడు జంతువులను ప్రాణంగా చూసుకుంటారు. అవి దూరమైతే మనిషి పోయినట్లే ఫీలవుతారు. ఉపాధి కోసం పెంచుకున్న ఆవు, మేకలను అమ్మాల్సిని పరిస్థితి ఉంటుంది. అలా వాటిని అమ్మినప్పుడు, మన నుంచి దూరమైనప్పుడు మనకు బాధ అనిపించినా.. అనిపించకపోయినా.. అవి మాత్రం కన్నీరు పెట్టుకుంటాయి. ఓ మేక ఇలానే యజమానిని పట్టుకుని మనిషిలా ఎడవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కన్నీరు పెట్టించింది..
ఓ మేకను అమ్మడానికి యజమాని మార్కెట్ కు తీసుకొ చ్చాడు. మేకను అమ్మి.. డబ్బులు తీసుకున్నాడు. ఇలా ఒప్పందం జరుగుతున్న సమయంలో ఆ మేక యజమాని భుజంపై తల పెట్టి.. కన్నీరు పెట్టుకుంది. మేకను చూసిన వారు మేక ఏడుపును చూసి వారూ కన్నీరు పెట్టుకున్నారు.మేక యజమాని కూడా దానిని కౌగిలించుకుని భావోద్వేగానికి గురయ్యాడు.
జంతువులే నయం..
అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. కానీ నెటిజన్లు ఈ వీడియో స్పందిస్తున్నారు. మనషుల కంటే జంతువులే నయమని ఒకరు.. ఎమోషన్స్ మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటాయన మరొకరు. మేక ఏడ్చినా దాన్ని కోసుకుని తినడమేనని ఇంకొకరు కామెంట్లు చేశారు.












Click it and Unblock the Notifications