• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జిల్ జిల్.. జిగా జిగా: ఈ బాబా ఒంటిపై ఉన్న బంగారం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

|
  నగల బరువుతో నరాలు దెబ్బతింటున్నాయి అంటున్న గోల్డెన్ బాబా

  ఢిల్లీ: గోల్డెన్ బాబా వచ్చేశాడు.. ఎవరీ గోల్డెన్ బాబా అనుకుంటున్నారా... ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే గోల్డెన్ బాబా. ఇతని ప్రత్యేకత ఏమిటంటారా...? ఆయన వంటిపై ఎప్పుడూ బంగారు నగలు దర్శనమిస్తాయి. ఏడాదికోసారి వంటిపై బంగారు నగలతో కన్వార్ యాత్రను నిర్వహిస్తాడు. అయితే ప్రతి ఏటా ఆయన వంటిపై బంగారం అలా పెరుగుతూ పోతోంది. ఇంతటి బంగారం చూస్తే ఎవరికైనా సరే కన్నుకుట్టాల్సిందే. ఇక ఈ బాబా ఎవరు ఇతని అసలు పేరు ఏమిటి..ఎందుకిలా బంగారంతోనే యాత్రలు చేస్తారనేది తెలుసుకుందాం...

  గోల్డెన్ బాబా అసలు పేరు బాబా అక సుధీర్ మక్కర్. ఈయనకు బంగారం అంటే పిచ్చి ప్రేమ కాదల్.. ఇక అన్నీను. తన ఒంటి మీద బంగారు లేకపోతే తెగ చిరాకు వస్తుందని చెబుతాడు. ఇక అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సుధీర్... తన ఆరేళ్ళ వయస్సులో గురుకులంలో చదవుకున్నాడు. ఆ తర్వాత బతుకుదెరువు కోసం హరిద్వార్ వెళ్లాడు. అక్కడ ఫుట్ పాత్ పై రంగుపూసలు, బట్టలు అమ్మాడు. వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తూ వచ్చాడు.

  శివుడి ఆశీర్వాదమే నన్ను ఇంతటి వాడిని చేసింది

  శివుడి ఆశీర్వాదమే నన్ను ఇంతటి వాడిని చేసింది

  ఫుట్ పాత్‌పై రంగుపూసలు, బట్టలు అమ్ముకుంటున్న అతని వ్యాపారాన్ని శివుడు ఆశీర్వదించడంతో వ్యాపారంలో లాభాలు చూసినట్లు చెబుతారు గోల్డెన్ బాబా. ఇక్కడ వచ్చిన లాభాలతో బిట్టు బ్రాండ్ పేరుతో జీన్స్ ప్యాంట్లు, షర్ట్స్, జాకెట్స్ విక్రయించినట్లు చెప్పాడు. ఈ వ్యాపారంతో పాటు ఆస్తులు కూడా క్రమంగా పెరిగినట్లు బాబా చెప్పాడు. ఇక అప్పటి నుంచి తను పూర్తిగా శివుని సేవలోనే ఉన్నట్లు వెల్లడించాడు.

  గోల్డెన్ బాబా ఒంటిపై ఎన్ని కిలోల బంగారం ఉందో తెలుసా..?

  గోల్డెన్ బాబా ఒంటిపై ఎన్ని కిలోల బంగారం ఉందో తెలుసా..?

  ప్రతి ఏటా గోల్డెన్ బాబా కన్వర్ యాత్రలో పాల్గొంటారు. ఆ సమయంలో తన వద్దనున్న బంగారం ఒంటిపై ధరించి పెద్ద కాన్వాయ్‌లో ఈ యాత్ర చేపడతారు. ఈ సారి ఆయన ఒంటిపై 20 కిలోల బంగారం దర్శనం ఇచ్చింది. ఈ రోజు మార్కెట్లో దాని విలువ రూ. 6 కోట్లు ఉండొచ్చని అంచనా. ప్రతి ఏటా జరిగే యాత్రలో ఆయన ఒంటిపై ఉన్న బంగారం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. 2016లో ఆయన ఒంటిపై 12 కిలోల బంగారం కనిపించింది. గతేడాది 14.5 కిలోల పసిడి నగలు బాబా ధరించారు. ఇందులో 21 బంగారు నగలు, ఆయా దేవుళ్లు దేవతలకు సంబంధించిన 21 లాకెట్లు, బ్రాస్లెట్లు, పసిడి జాకెట్ ఉన్నాయి.

  నగల బరువుతో నరాలు దెబ్బతింటున్నాయి

  నగల బరువుతో నరాలు దెబ్బతింటున్నాయి

  కొత్తగా ధరించిన బంగారం గొలుసు రెండు కేజీల బరువుందని దానికి శివుడి లాకెట్ ఉందని తెలిపాడు సుధీర్ మక్కర్ అలియాస్ గోల్డెన్ బాబా.ఈ సారి యాత్రలో బంగారం ఎక్కువగా తన ఒంటిపై ధరించడం లేదని స్పష్టం చేశాడు.ఎక్కువ నగలు శరీరంపై ఉండటం, వాటి బరువుతో నరాలు దెబ్బ తింటున్నాయని చెప్పిన గోల్డెన్ బాబా... ఇప్పటికే తన కంటి చూపు దెబ్బతినిందని వివరించాడు. గత 25 ఏళ్లుగా కన్వార్ యాత్ర చేస్తున్నట్లు చెప్పిన బాబా... ఈసారి యాత్ర చివరిది కానుందని చెప్పారు.

   కార్లు, బంగారు నగలపై ప్రేమ చావదు

  కార్లు, బంగారు నగలపై ప్రేమ చావదు

  ప్రతి ఏటా హరిద్వార్ నుంచి ఢిల్లీ వరకు మొత్తం 200 కిలోమీటర్ల పాటు ఈ కన్వార్ యాత్ర ఉంటుంది. ఆ సమయంలో గోల్డెన్ బాబా తన నగల ప్రదర్శనను ఇస్తారు. అందుకే గోల్డెన్ బాబా అంటే తెలియనివారుండరు. తన కాన్వాయ్‌లో ఓపెన్ టాప్ కారుపై ఉండి ప్రజలకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగుతాడు. ఇక బంగారం సంగతి అటుంచితే సుధీర్ అలియాస్ గోల్డెన్ బాబాకు విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. అవన్నీ తన కాన్వాయ్‌లో కనిపిస్తాయి. అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ, మూడు ఫార్చునర్ కార్లు,రెండు ఆడి కార్లు, రెండు ఇన్నోవా కార్లు తన కాన్వాయ్‌లో కనిపిస్తాయి. కొన్నిసార్లు హరిద్వార్‌కు వచ్చేందుకు ఈ గోల్డెన్ బాబా కాస్లీ కార్లు అయిన హమ్మర్, జాగ్వార్, ల్యాండ్ రోవర్‌లను అద్దెకు తీసుకుంటాడు. బంగారం పక్కనపెడితే బాబా రూ.27 లక్షలు ఖరీదు చేసే రోలెక్స్ కంపెనీ చేతిగడియారాన్ని ధరిస్తారు.

  బంగారు నగలు కార్లపై తనకున్న ప్రేమ చావదని చెప్పిన సుధీర్ బాబా...1972లో తొలిసారిగా తను బంగారం కొనుగోలు చేసినట్లు గుర్తుచేసుకున్నాడు. ఆ రోజుల్లో తులం బంగారం రూ.200 పెట్టి కొనుగోలు చేసినట్లు చెప్పాడు. అప్పట్లో తన వద్ద నాలుగు తులాల బంగారం మాత్రమే ఉండేదని చెప్పాడు. చిన్నగా శివుడి ఆశీర్వాదంతో బంగారం పెరిగింది. తన చివరి శ్వాస వరకు బంగారం తనతోనే ఉంటుందని తన మృతి అనంతరం తన ప్రియశిష్యుడికి ఆ బంగారం అందేలా వీలునామా రాస్తానని చెప్పుకొచ్చాడు గోల్డెన్ బాబా.

  గోల్డెన్ బాబాను చూడటమంటే యువత, మహిళలు , చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహం చూపుతారు. ప్రతి ఏటా ఆ మార్గంలో గోల్డెన్ బాబా కాన్వాయ్ వెళుతుండటంతో ... ఆ కాన్వాయ్ కోసం వారు ఓపికతో ఎదురుచూస్తూ ఉంటారు. గోల్డెన్ బాబా రాగానే అతనితో సెల్ఫీలు దిగుతారు, వీడియోలు తీసుకుంటారు. అతని పాదాలకు మ్రొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Golden Baba, known for participating in Kanwar Yatra wearing gold jewellery, is back and with more gold.Baba aka Sudhir Makkar, undertaking his 25th Kanwar Yatra this year, is said to be wearing gold jewellery weighing around 20 kgs, which at today’s market price would be worth approximately Rs 6 crore. With each yatra, Makkar’s gold acquisitions have gone up, in 2016 he was sporting 12kgs of gold.
  Get Instant News Updates
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more