వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 18నెలల్లో 10లక్షల ఉద్యోగాలభర్తీ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పీఎం మోడీ!!

|
Google Oneindia TeluguNews

ఎప్పుడెప్పుడా అని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) మంగళవారం నాడు సంచలన ప్రకటన చేసింది. వచ్చే 18 నెలల్లో 10 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటన చేసింది.

10 లక్షల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మోడీ

ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్యమైన ప్రకటన చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలలో మానవ వనరులను పరిశీలించారని, రాబోయే 1.5 సంవత్సరాలలో 10 లక్షల మందిని రిక్రూట్‌మెంట్ ప్రభుత్వం చేస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. అదే విషయాన్ని ప్రకటిస్తూ, ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్లో ట్వీట్ చేసింది. 10 లక్షల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పేర్కొంది.

త్వరలో రిక్రూట్మెంట్ డ్రైవ్ ...పీఎంవో కార్యాలయం ప్రకటన

త్వరలో రిక్రూట్మెంట్ డ్రైవ్ ...పీఎంవో కార్యాలయం ప్రకటన

"ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని శాఖలు మరియు మంత్రిత్వ శాఖలలో మానవ వనరుల స్థితిని సమీక్షించారని పేర్కొంది. రాబోయే 18 నెలలలో 10 లక్షల మందిని ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ చేయనుందని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు త్వరలో రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.

నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాల విమర్శలు.. చెక్ పెట్టిన కేంద్రం

నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాల విమర్శలు.. చెక్ పెట్టిన కేంద్రం

ఇదిలా ఉంటే దేశంలో ఉద్యోగాల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ పార్టీ పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఇక ఇటీవల మంత్రి కేటీఆర్ కూడా నిరుద్యోగ సమస్య పై ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు. నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు తరచూ విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ రంగాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న పోస్టులపై తరచూ చెలరేగుతున్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మోడీ సర్కార్

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మోడీ సర్కార్

ఇక ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారందరికీ ఇది శుభవార్త. కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న ఖాళీల స్వభావం మరియు స్థాయి గురించి ప్రస్తుతం కసరత్తు కొనసాగుతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన మరింత సమాచారం కొన్ని నెలల్లో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. ఇక ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? నోటిఫికేషన్లు ఎప్పుడు రానున్నాయనేది కూడా తెలియాల్సి ఉంది.

English summary
The Prime Minister's Office has said good news for the unemployed. PM Modi has given the green signal to recruit 10 lakh jobs in 18 months. Orders have been issued to all the departments to this effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X