కార్మికులకు శుభవార్త.. నెల సంపాదన 5 వేలా.. ఇకపై 10 వేలు రానుంది..!
ఢిల్లీ : కార్మికులకు శుభవార్త. కనీస వేతనం రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజు కనీస సగటు వేతనం 176 రూపాయలు ఉండగా.. గరిష్ఠంగా 447 రూపాయలకు చేరనుంది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ఇది వర్తించనుంది. దేశ స్థాయిలో కనీస వేతనాల అమలు కోసం ఏర్పాటైన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు.. కేంద్రం త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 29 రాష్ట్రాలను 5 విభాగాలుగా చేస్తూ కనీస వేతనాలను ప్రతిపాదించిన కమిటీ.. నివేదికను కేంద్ర కార్మిక శాఖకు పంపింది. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కనీస వేతనం 380 రూపాయలుగా.. నెలకు 9 వేల 880 రూపాయలుగా పేర్కొంది.
కనీస వేతనాల అమలుకు గతంలో చూసినట్లయితే దేశవ్యాప్తంగా 3 రీజియన్లు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్యను ఐదుకు పెంచారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను బట్టి ఏ ఏ రాష్ట్రాలు ఏయే రీజియన్లలో ఉండాలనేది కమిటీ సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఈ రెండు కూడా రీజియన్ - 2 లో ఉన్నాయి. కనీస వేతనం డబుల్ చేస్తూ సిఫార్సు చేసిన కమిటీ.. ఇంటి అద్దె రోజుకి 55 రూపాయలంటూ అదనంగా పేర్కొంది.

రాష్ట్రాలు, రీజియన్ల వారీగా ఆ కమిటీ సిఫార్సు చేసిన కనీస వేతనం వివరాలు:
| రీజియన్ | రాష్ట్రాలు | రోజు కనీస వేతనం | నెలవారీ కనీస వేతనం |
| రీజియన్ -1 | అసోం, బీహార్, ఝార్ఖండ్ , మధ్యప్రదేశ్, ఒడిశా, యూపీ, పశ్చిమ బెంగాల్ | 342 రూపాయలు | 8,892 రూపాయలు |
| రీజియన్-2 | ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ,రాజస్థాన్, జమ్ముకశ్మీర్ ,ఉత్తరాఖండ్ | 380 రూపాయలు | 9,880 రూపాయలు |
| రీజియన్-3 | గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు | 414 రూపాయలు | 10,764 రూపాయలు |
| రీజియన్-4 | ఢిల్లీ, గోవా, హిమాచల్ ప్రదేశ్ , హర్యానా, పంజాబ్ | 447 రూపాయలు | 11,622 రూపాయలు |
| రీజియన్-5 | ఈశాన్య రాష్ట్రాలు | 386 రూపాయలు | 10,036 రూపాయలు |
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications