గుడ్ న్యూస్: ఆ నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు!
భారతీయ రైల్వేలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ల విషయంలో తాజాగా మరో శుభవార్త బయటకు వచ్చింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్వీస్ లను విస్తరిస్తున్న భారతీయ రైల్వే త్వరలో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనుంది. ఈ కొత్త సెమీ హై స్పీడ్ రైళ్ల కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణికుల యొక్క ప్రయాణ అనుభవం మెరుగుపడుతుంది.
ఈ రాష్ట్రాలలో కొత్త వందే భారత్ రైళ్ళ సేవలు
ప్రస్తుతం నాలుగు కొత్త హై స్పీడ్ రైళ్లను వివిధ మార్గాలలో రంగంలోకి దింపనున్న క్రమంలో దేశవ్యాప్తంగా మొత్తం వందే భారత్ సేవల సంఖ్య 164 కు చేరుకుంటుంది. కొత్తగా రైల్వే శాఖ ఆమోదించిన ఈ వందే భారత్ రైళ్లను కర్ణాటక, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీ లకు కేటాయించారు.

కొత్త వందే భారత్ రైళ్ళు నడిచేది ఈ మార్గాల్లోనే
ఈ కొత్త వందే భారత్ రైళ్లు కేఎస్ ఆర్ బెంగళూరు - ఎర్నాకులం కు, ఫిరోజ్ పూర్ కాంట్ - ఢిల్లీ, వారణాసి - ఖజురహో, లక్నో - సహరాన్పూర్ మధ్య నడుస్తాయి. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పిన ప్రకారం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఆదరణ బాగా పెరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అన్ని మార్గాలలో 100 శాతానికి పైగా నడుస్తున్నాయి.
రైళ్ళలో బాగా పెరిగిన ఆక్యుపెన్సీ
2024 - 25 ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల మొత్తం ఆక్యుపెన్సీ 102.01 శాతం, అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆక్యుపెన్సీ రేటు మరింత పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 105.03 శాతం రైల్వే ప్రయాణికుల ఆక్యుపెన్సీ ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఆక్యుపెన్సీ రేటు పెరగడం ప్రధానంగా కనిపిస్తుంది.
తెలంగాణాకు కొత్త వందే భారత్ లు
ఇదిలా ఉంటే భారతీయ రైల్వేలు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా ప్రారంభించనున్నారు. దీనికోసం వందే భారత్ స్లీపర్ రైల్ కోచ్ లను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే దక్షిణ మరియు పశ్చిమ భారతదేశంలో అనేక కొత్త వందే భారత్ రైళ్లను వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టిన ఇండియన్ రైల్వే తెలంగాణ రాష్ట్రానికి కూడా అనేక వందే భారత్ రైలు సేవలను అందిస్తోంది.
ఈ మార్గాలలో వందే భారత్
కొన్ని మార్గాలకు వందే భారత్ రైళ్ల ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. కాచిగూడ - యశ్వంతపూర్ మార్గంలో ఇప్పటికే వందే భారత్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక తెలంగాణ మహారాష్ట్ర మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తూ సికింద్రాబాద్ నుండి పూణేకు కొత్త రైలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇక సికింద్రాబాద్ నుండి నాగపూర్ కు కూడా వందే భారత్ నడపాలని. ప్రతిపాదన ఉంది.












Click it and Unblock the Notifications