యూపీలో చిన్న పార్టీల పెద్ద ప్రభావం-కులసమీకరణాల్లో కీలకం-బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ గాలం

యూపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్ని దేశమంతా గమనిస్తోంది 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల సెమీఫైనల్స్ గా రాజకీయ పార్టీలు భావిస్తున్న ఈ పోరులో బీజేపీ, ఎస్పీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. అయితే ఈ రెండు పార్టీల గెలుపోటముల్ని నిర్ణయించే స్ధాయిలో యూపీలో చిన్న పార్టీలు ఉన్నాయి. గతంలో జరిగిన 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్ధులు వెయ్యిలోపే మెజారిటీలు సాధించిన నేపథ్యంలో ఈసారి కూడా ఈ చిన్న పార్టీల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

 ఆసక్తికరంగా యూపీ పోరు

ఆసక్తికరంగా యూపీ పోరు

యూపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్పీలకు చావోరేవో అన్నట్లుగా మారిపోయాయి. దీంతో ప్రత్యర్ధులపై పైచేయి సాధించేందుకు ఇరు పార్టీల సారధులు యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ చేయని ప్రయత్నం లేదు. ముఖ్యంగా వీరిద్దరూ చిన్న పార్టీల సాయంతో ఈ ఎన్నికల్ని గట్టెక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తి రేపుతున్నాయి. పలు చోట్ల ముఖాముఖీ పోరు నెలకొన్న చోట్ల ఈ చిన్న పార్టీలు ప్రధాన పార్టీల అభ్యర్దుల గెలుపోటముల్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉండటంతో ఇప్పుడు అందరి చూపూ ఈ పార్టీలపైనే నెలకొంది.

 బీజేపీతో అప్నాదళ్, నిషాద్ పార్టీ

బీజేపీతో అప్నాదళ్, నిషాద్ పార్టీ

యూపీలో 35 ఏళ్లుగా ఓసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అధికారంలో ఉన్న పార్టీ తిరిగి పగ్గాలు చేపట్టిన దాఖలాలు లేవు. దీన్ని బ్రేక్ చేసేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే అన్ని ఒపీనియన్ పోల్స్ యోగీ తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని తేల్చిచెప్పేశాయి. అయినా యోగీతో పాటు బీజేపీలో మాత్రం ఎక్కడో మూల ఓ అనుమానం. దీంతో రాష్ట్రంలో చిన్న పార్టీల సాయంతో ఈసారి ఎలాగైనా గట్టెక్కాలని వీరు భావిస్తున్నారు. కుర్మీ సామాజికవర్గానికి ప్రతినిధిగా చెప్పుకునే అప్నాదళ్(సోనేలాల్)ను కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ నడిపిస్తున్నారు. 2017లో యూపీలో మొదటిదశ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో 11 స్ధానాల్లో పోటీ చేసి 9 గెలిచిన చరిత్ర ఈ పార్టీది. బీజేపీకి ఈ పార్టీ గట్టి మద్దతుగారుగా ఉంది. మత్యకార సామాజికవర్గ బలమున్న నిషాద్ పార్టీ గతంలో ఒంటరిగా పోటీ చేసి దెబ్బతిన్నది. ఇప్పుడు బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది. అప్నాదళ్, నిషాద్ పార్టీ సాయంతో ఈసారి గట్టెక్కాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది.

 ఆర్ఎల్డీపై సమాజ్ వాదీ ఆశలు

ఆర్ఎల్డీపై సమాజ్ వాదీ ఆశలు

ఈ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీకి గట్టిపోటీ ఇస్తున్న సమాజ్ వాదీ పార్టీ.. పక్కా కులసమీకరణాలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా అజిత్ సింగ్ కు చెందిన రాష్ట్రీయ లోక్ దళ్ తో పొత్తు పెట్టుకుంది. తండ్రి అజిత్ సింగ్ అనారోగ్యంతో మంచానపడటంతో కుమారుడు జయంత్ చౌదరి ఈ పార్టీని నడిపిస్తున్నారు. ఆర్ఎల్డీని మచ్చిక చేసుకునేందుకు బీజేపీ ఎంతగా ప్రయత్నించినా ఆ పార్టీ మాత్రం సమాజ్ వాదీ పార్టీతోనే కలిసి పోరుకు సిద్దమైంది. పశ్చిమయూపీలోని జాట్ ఓటు బ్యాంక్ ను సమాజ్ వాదీకి అనుకూలంగా మార్చేందుకు జయంత్ చౌదరి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే కేశవ్ దేవ్ మౌర్య ఆధ్వర్యంలోని మహాన్ దళ్ కూడా పశ్చిమ యూపీతో పాటు రోహిల్ ఖండ్ ప్రాంతంలో ప్రభావం చూపే అవకాశముంది. ఈ పార్టీ కూడా సమాజ్ వాదీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది. మరో చిన్న పార్టీ అప్నాదళ్ (కే) కూడా ఎస్పీకే మద్దతిస్తోంది.

Recommended Video

    BJP India’s Richest Party, Highest Assets Among Top 7 Parties | Oneindia Telugu
     కాంగ్రెస్, బీఎస్పీ, ఎంఐఎం

    కాంగ్రెస్, బీఎస్పీ, ఎంఐఎం

    యూపీలో బీజేపీ, ఎస్పీ తర్వాత స్ధానాల్లో ఈసారి నిలవబోయేది కాంగ్రెస్, బీఎస్పీ, ఎంఐఎం పార్టీలే. ఇందులో గతంలో ఓ వెలుగు వెలిగి పలుమార్లు అధికారంలోకి వచ్చిన చరిత్ర ఉన్న బీఎస్పీ చివరి క్షణం వరకూ స్తబ్ధుగా ఉండిపోయింది. అయితే చివర్లో బరిలోకి దిగి అదృష్టం పరీక్షించుకుంటోంది. ఎస్సీ నియోజకవర్గాల్లో సైతం జవసత్వాలు కోల్పోయిన బీఎస్పీ పలుచోట్ల మాత్రం ప్రధాన పార్టీల ఆశలపై నీళ్లు జల్లబోతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా పలు చోట్ల ఈసారి అభ్యర్ధుల గెలుపోటముల్ని ప్రభావితం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు హైదరాబాదీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం సైతం ఇద్దరు సీఎంలు, ముగ్గురు డిప్యూటీ సీఎంల నినాదంతో బరిలోకి దిగుతోంది. ఎంఐఎం కూడా పలు స్దానాల్లో ఎస్పీ, బీఎస్పీ అవకాశాలపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు చిన్న పార్టీలు చూపే ప్రభావం చర్చనీయాంశమవుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+