400 రైల్వే స్టేషన్లలో ఉచిత గూగుల్ వైఫై
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది. రైల్టెల్ సహకారంతో ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ ప్రయాణికులకు ఈ సదుపాయం కల్పించింది.
అసోంలోని దిబ్రుగఢ్ రైల్వేస్టేషన్లో గురువారం ఉచిత వైఫై ఏర్పాటుచేశారు. దీంతో దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని గూగుల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

డిజిటల్ ఇండియాలో భాగంగా 2016 జనవరిలో ఈ ఉచితవైఫై కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైల్వేశాఖకు చెందిన టెలికాం విభాగం రైల్టెల్ సహాకారంతో గూగుల్ రైల్వేస్టేషన్లలో వైఫై రూటర్లను ఏర్పాటుచేస్తోంది. తొలిసారిగా ముంబై సెంట్రల్ స్టేషన్లో ఈ ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ప్రాజెక్టును చేపట్టిన తొలి ఏడాదిలో దేశవ్యాప్తంగా 100 పెద్ద రైల్వేస్టేషన్లలో వైఫైను ఏర్పాటుచేశారు. నేటితో ఆ సంఖ్య 400కు చేరింది. ఈ వైఫైతో స్టేషన్లకు వచ్చే ప్రయాణికులు 30 నిమిషాల పాటు ఉచితంగా ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications