రేపు భారత్‌కు గూగుల్ సీఈఓ: పర్యటన విశేషాలివే
న్యూఢిల్లీ: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బుధవారం భారత్‌కు వస్తున్నారు. తన రెండు రోజుల భారత్ పర్యనటలో భాగంగా సుందర్ పిచాయ్ ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతో భేటీ కానున్నారు. పిచాయ్ గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి భారత్‌కు వస్తున్నారు.
ముందుగా రేపు ఢిల్లీలో గూగుల్ నిర్వహించే కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లతో సమావేశం కానున్నట్లు తెలిసింది. గురువారం ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు.

ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి ఇచ్చే విందుకు పిచాయ్ హాజరవుతారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు గూగుల్ ప్రధాన కార్యాలయంలో సుందర్ పిచాయ్ సమావేశమయ్యారు.
ఆ సందర్భంగా గూగుల్, భారతీయ రైల్వే శాఖతో కలిసి దేశంలో ఉచిత వై ఫై కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. పిచాయ్ తాజా పర్యనటలో గూగుల్ భారత్‌లో చేపట్టబోయే భవిష్యత్ కార్యక్రమాల ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. తమిళనాడులోని చెన్నైకి చెందిన సుందర్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్నారు.












Click it and Unblock the Notifications