చిన్నారుల మృతి: క్రిమినల్ చర్యలు తీసుకోవాలని యోగి ఆదేశం

గోరఖ్‌పూర్ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటనకు కారకులైన బీఆర్డీ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ రాజీవ్‌ మిశ్రా, ఆక్సిజన్‌ సరఫరా చేసే పుష్ప సేల్స్‌పై క్ర

లక్నో: గోరఖ్‌పూర్ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటనకు కారకులైన బీఆర్డీ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ రాజీవ్‌ మిశ్రా, ఆక్సిజన్‌ సరఫరా చేసే పుష్ప సేల్స్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆగస్టు 10, 11 తేదీల్లో గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయి పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

Gorakhpur tragedy: Yogi Adityanath govt orders FIRs against officials of BRD Medical College, oxygen supplier

ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆగస్టు 20న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఈ ఘటన జరగడానికి గల కారణాలను మాత్రం ప్రభుత్వం కానీ, విచారణ బృందం గానీ వివరించలేదు.

గోరఖ్‌పూర్‌ ఘటన జరగడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే డా సతీష్‌, ఆక్సిజన్‌ సరఫరా ఇంచార్జ్, అనస్తీషియా వార్డు హెఓడీ డా ఖలీఫ్ ఖాన్‌, 100 పడకలు గల ఏఈఎస్‌ వార్డు ఇంఛార్జ్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోనున్నట్లు అధికారుల తెలిపారు.

ప్రభుత్వం పేర్కొన్న వీరందరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. కమిటీ మరికొందరిపైనా చర్యలు తీసుకోవాలంటూ నివేదికలో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+