దాణా స్కాంలో జైలు శిక్ష మళ్లీ రేపటికి వాయిదా: లాలూ మనుషుల నుంచి ఫోన్లు.. జడ్జి వ్యాఖ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: దాణా స్కాంలో ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర దోషులకు శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో లాతో పాటు మరో 15 మందిని దోషులుగా తేలుస్తూ గత ఏడాది 23న రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

దాణా స్కాం: లాలూ ప్రసాద్ యాదవ్‌కు జైలు శిక్ష రేపు ఖరారు

దీనికి సంబంధించి జనవరి 3న శిక్ష ఖరారు చేస్తామని చెప్పింది. అయితే బుధవారం న్యాయవాది విందేశ్వర ప్రసాద్‌ మృతితో తీర్పు గురువారానికి వాయిదా వేశారు. నేడు మళ్లీ శుక్రవారానికి వాయిదా వేశారు.

'Got phone calls from Lalu's men': Fodder scam judge after sentencing postponed for 2nd day in a row

కాగా, ఈ సందర్భంగా జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ మనుషుల నుంచి తనకు ఫోన్లు వచ్చాయని, కానీ భయపడాల్సింది లేదని, నేను చట్టాన్ని అనుసరిస్తానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆయన లాలూతోనే అన్నట్లుగా తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The judge in the second fodder scam case in which Lalu Prasad has been convicted said today, after sentencing was postponed yet again+ , that he "got phone calls from Lalu's men", reported PTI news agency. Judge Shivpal Singh didn't specify what was said to him in these phone calls "by Lalu's men".

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి