అగ్నిపర్వతంతో చెలగాటం ఆడొద్దు, హిమాలయాల మందు ఎంత: తమిళి సై వర్సెస్ డీఎంకే
అసలే తెలంగాణ ప్రభుత్వంతో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌కి పడటం లేదు. ప్రభుత్వంపై ఏదో విషయంలో ఇష్యూ ఉండనే ఉంది. ఇటు ఆమెను డీఎంకే పార్టీ టార్గెట్ చేసింది. విమర్శలు చేయగా.. తమిళి సై కూడా అదే రేంజ్‌లో కౌంటర్ అటాక్ చేసింది. డీఎంకే వర్సెస్ తమిళి సై మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.

పట్టించుకోవడం లేదట..
గవర్నర్‌ను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని డీఎంకే ఆరోపణలు చేసింది. అందుకే ఆమె చెన్నైలో ఉంటున్నారని హాట్ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలను తమిళి సై కూడా అదే రేంజ్‌లో విమర్శలు చేశారు. మీకు కూడా తెలుగు మూలాలు ఉన్నాయని మండిపడ్డారు. ఇంట్లో తెలుగు మాట్లాడుతూ.. తమిళ వేషం వేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కోరారు. తిరుక్తల్ సూక్తిని తాను పాటిస్తున్నానని కామెంట్ చేశారు.

అగ్నిపర్వతంతో చెలగాటం..
తమిళి సై కామెంట్లకు డీఎంకే అదే స్థాయిలో పంచ్ ఇచ్చింది. అగ్నిపర్వతంతో చెలగాలం ఆడొద్దని వ్యాఖ్యలు చేసింది. దీనికి తమిళి సై కూడా అదే స్థాయిలో విరుచుకుపడింది. హిమాలయాల ముందు అగ్నిపర్వతాలు ఏమీ చేయలేవని కామెంట్ చేశారు. సాలె పురుగుల సింహాలను ఏమీ చేయలేవని అదేస్థాయిలో విరుచుకుపడ్డారు.

డీఎంకే ఎంట్రీ.. వివాదం ఇలా
తమిళి సై సౌందరరాజన్ తమిళనాడుకు చెందిన వారు.. అంతకుముందు బీజేపీలో క్రియాశీలక పాత్ర కూడా పోషించారు. ఆ తర్వాత గవర్నర్ పదవీని చేపట్టారు. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని డీఎంకే అంటోంది. నిజానికి సీఎం కేసీఆర్- గవర్నర్ తమిళి సై మధ్య పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవడంతో వివాదం నెలకొంది. ఇక అప్పటినుంచి ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. గవర్నర్ అధికార కార్యక్రమాలకు కూడా ప్రొటోకాల్ పాటించలేదు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ క్రమంలో డీఎంకే గవర్నర్‌ను టార్గెట్ చేసింది. దానికి ఆమె కూడా అదే స్థాయిలో స్పందించారు.












Click it and Unblock the Notifications