
కేసీఆర్ ముందస్తుకు వెళ్లకపోవచ్చు, ప్రోటోకాల్ మార్పు లేదు: తమిళి సై హాట్ కామెంట్స్
భారత ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అట్టహాసంగా కార్యక్రమం జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళి సై కూడా పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇటీవల సీఎం కేసీఆర్- గవర్నర్ తమిళిసై మధ్య పొసగని సంగతి తెలిసిందే. దీంతో ఆమె కేంద్రానికి కంప్లైంట్స్ కూడా చేశారు. మళ్లీ హస్తినలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

గౌరవం..
ద్రౌపది ముర్ముకు రాష్ట్రపతి పదవీ లభించడం తమకు దక్కిన గౌరవం అని చెప్పారు. ప్రత్యేకంగా గిరిపుత్రులకు దక్కిన సువర్ణావకాశం అని చెప్పారు. నామినేషన్ వేసిన సమయంలో తాను వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించానని తెలిపారు. అందుకే ఇప్పుడు హాజరయ్యానని వివరించారు. తాను రాష్ట్రానికి ప్రథమ పౌరురాలినని చెప్పారు. అందుకే వరద ప్రభావానికి గురయిన ప్రాంతంలో పర్యటించానని తెలిపారు.

ఆదీవాసీలకే నష్టం..
రాష్ట్రంలో వరదల వల్ల ఎక్కువ ఆదీవాసీలకే నష్టం కలిగిందని చెప్పారు. ఆదీవాసీలు ఉన్న భద్రాచలంలో ఆమె పర్యటించిన సంగతి తెలిసిందే. వరద ప్రభావం గురించి ఇప్పటికే హోంశాఖకు నివేదిక అందజేశానని వివరించారు. ఫ్లడ్ ఎఫెక్టెట్ ఎరియాల్లో సీఎం కేసీఆర్ కూడా పాల్గొన్నారు. నష్టపోయిన వారిని ఆదుకుంటామని భరోసా కూడా ఇచ్చారు. ఆ క్రమంలోనే తమిళి సై కూడా పర్యటించారు.

తమిళి సై నివేదిక.. రూ.వెయ్యి కోట్లు
రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. ఆయన విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అందుకే గైర్హాజరు అయ్యారు. కానీ తమిళి సై మాత్రం హాజరయ్యారు. వరద ప్రభావం గురించి హోంశాఖకు.. కేంద్ర పెద్దలకు నివేదిక కూడా అందజేశారట. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు అందజేయాలని సీఎం కేసీఆర్ కోరారు. మొత్తం రూ.1400 కోట్ల నష్టం అంచనా వేసి.. వెయ్యి కోట్లు అడిగారు. ఈ క్రమంలో తమిళి సై నివేదిక ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రోటోకాల్‌లో మార్పులేదు
సీఎం కేసీఆర్ రాజ్ భవన్ వచ్చిన తర్వాత కూడా అధికారుల తీరులో మార్పు లేదని చెప్పారు. ప్రోటోకాల్‌లో ఏ మాత్రం మార్పులేదని చెప్పారు.భద్రాచలంలో తన పర్యటనలో అధికారులు ఎవరూ రాలేదని చెప్పారు. మిగతా రాష్ట్రాల గవర్నర్ల మాదిరిగా తాను ఉండటం లేదని వివరించారు. అలాగే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని చెప్పారు.